గత రెండురోజులుగా మహేష్ ‘1’ సినిమా కు సంబంధించిన పోస్టర్ పై సమంత తన ట్విటర్ లో పెట్టిన కామెంట్ల పై టాలీవుడ్ లో తెగ హడావిడి జరుగుతోంది. మహేష్ తో ‘దూకుడు’ సినిమాలో నటించే దాకా చిన్న స్థాయి హీరోయిన్ గా ఉన్న సమంత కెరియర్ కు ‘దూకుడు’ టర్నింగ్ పాయింట్ అయింది. అంతేకాకుండా సమంతను టాలీవుడ్ లో ప్రోత్సహించిన హీరోల లిస్టులో ప్రధమంగా మహేష్ ఉంటాడు.  అటువంటి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ పై కయ్యానికి సమంత ఎందుకు కాలు దువ్వింది అనే విషయం పై ఒక ఆశక్తికర కధనం వినపడుతోంది సమంత మహేష్ తో నటించిన ‘దూకుడు’ విడుదల కాక ముందు దర్శకుడు సుకుమార్ తాను నాగచైతన్యతో తీస్తున్న 100% లవ్ సినిమాకు హీరోయిన్ గా ముందుగా తమన్నాకు బదులు సమంతను అనుకున్నారట. ఈ సినిమాకు హీరోయిన్ పాత్రకు సంబంధించి స్క్రీన్ టెస్ట్ సమంతకు మొట్టమొదటిగా చేసిన సుకుమార్ తన సినిమాలోని హీరోయిన్ పాత్ర నటనకు బాగా ఆస్కారం ఉన్న పాత్ర కాబట్టి ఆ రోల్ కు సమంత సరిపోదు అంటు ఆమె ఎదురుగా కామెంట్ చేయడమే కాకుండా ఆమె స్థానంలో తమన్నాను తీసుకున్నాడట.  అప్పటికే గౌతమ్ మీనన్ దర్సకత్వంలో ‘ఏమిమాయచేసావే’ సినిమా ద్వారా మంచి నటిగా పేరు తెచ్చుకున్న సమంతకు దర్శకుడు సుకుమార్ ఇచ్చిన షాక్ తో బుర్ర తిరిగి అతడిని ఎక్కడ కార్నర్ చేద్దామా అని రగిలిపోతూ అవకాసం గురించి ఎదురు చూస్తోందట మన క్యూట్ హీరోయిన్. ఈ నేపధ్యంలో సుకుమార్ దర్సకత్వం వహించిన మహేష్ ‘1’ సినిమా పై కామెంట్లు చేస్తే మహేష్ ప్రస్తవన తన కామెంట్లో పెట్టకపోయినా అది సుకుమార్ కు తగలకుండా తిరిగి తిరిగి మహేష్ అభిమానుల కోపానికి గురిచేయడమే కాకుండా తనని రోడ్డున పడేసింది అని బాధ పడుతోందట మన మాయలేడి.  

మరింత సమాచారం తెలుసుకోండి: