
అసలే వయస్సులో ఉన్న నలుగురు అమ్మాయిలు.. అందులోనూ బాగా ఎంజాయ్ చేద్దామనే కసిమీద ఉన్నారు. అందుకే ఓ మగాడిని బుక్ చేసుకున్నారు. అతడితో ఓ రిసార్ట్ లో ఎంజాయ్ చేద్దామనుకున్నారు. వింటుంటేనే మాంచి మసాలా కథలా ఉంది కదా.. ఇక్కడే క్రైమ్ సీన్ ఎంటరవుతుంది. ఇప్పుడు అడల్ట్ కామెడీ ప్లస్ క్రైమ్ టాలీవుడ్ లో సక్సస్ ఫార్ములాగా తయారైంది.
హారర్, అడర్ట్ కామెడీ ఉంటే.. మినిమం గ్యారంటీ అన్న కాన్ఫిడెన్స్ నిర్మాతలకు వచ్చేసింది. ప్రేమకథా చిత్రమ్ తో మొదలైన ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఆర్ ఎక్స్ 100, ఏడు చేపల కథ వంటి సినిమాల సక్సస్ తో చాలా మంది ఈ బాటలో వెళ్తున్నారు. ఇప్పుడు ఈ డోస్ ఇంకాస్త పెంచుతూ మరో సినిమా రాబోతోంది. అదే ‘అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి ’ చిత్రం.
ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ ఈ నలుగురు అమ్మాయిలు. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ.. మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా అన్నారు.
హైదరాబాద్లో ఉండే ఈ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేస్తామని బాలు అడుసుమిల్లి తెలిపారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఇంట్రస్టింగా ఉంది.