సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇప్పటికే చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం మహేష్ బాబు, తమన్నాల పై ఒక ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తోంది సినిమా యూనిట్. 

 

సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇక దీని తరువాత మహేష్ బాబు 27వ సినిమాని ఇటీవల తనతో మహర్షి సినిమాను తీసిన వంశీ పైడిపల్లితో చేయనున్నట్లు ఒక ప్రకటన రావడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ బాబు నటించబోయే 28వ సినిమాకు కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్నట్లు నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కథను మహేష్ బాబుకు వినిపించడం జరిగిందని, అలానే ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ యువ భామ ఆషిక రంగనాథ్ ని కూడా ఎంపిక చేసాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. 

 

ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ అత్యంత భారీ వ్యయంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోయే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన అతి త్వరలో రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కెజిఎఫ్ చాప్టర్ 2 ని తీస్తున్న ప్రశాంత్ నీల్, మార్చి సమయానికల్లా దానిని పూర్తి చేస్తారని, ఈలోపు మహేష్ కూడా ఒక మూడు నెలల గ్యాప్ తీసుకుని రెడీగా ఉంటారని, ఆ సమయంలో ఒకేసారి వంశీ పైడిపల్లి మరియు ప్రశాంత్ నీల్ సినిమాలు మొదలవుతాయని అంటున్నారు. కాగా ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: