నిన్న సాయింత్రం విడుదలైన ‘అల వైకుంఠపురములో’ టీజర్ కు విపరీతమైన స్పందన రావడంతో ఈటీజర్ సంచలనాలు కొనసాగుతున్నాయి. రెడ్ కలర్ బ్లేజర్ ను స్టైల్ గా వేసుకుని ఒక పొడవాటి కాన్ఫరెన్స్ టేబుల్ పై అడ్డంగా దాటుతు నడుస్తున్న అల్లు అర్జున్ ను చూడగానే బన్నీ త్రివిక్రమ్ మార్క్ తో పాటు ఈ టీజర్ ను చూస్తున్నవారికి చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ మూవీలోని ఆఫీస్ తరహా సీన్స్ గుర్తుకు వస్తాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ టీజర్ లో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ తో పాటు స్టైల్ అంతా కూడ చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ మూవీలోని ఆఫీస్ సీన్స్ నుంచి స్పూర్తి పొందినట్లు అని పిస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ఇప్పటికే ఈ మూవీ కధను ఎన్టీఆర్ పాత సినిమా ‘ఇంటి గుట్టు’ స్పూర్తితో తీసిన త్రివిక్రమ్ ఈ మూవీలోని ఆఫీస్ సీన్స్ ను మక్కీకి మక్కీగా ‘రౌడీ అల్లుడు’ నుండి కాపీ కొట్టేసాడా అంటూ జోక్స్ పేలుతున్నాయి.
ఇప్పటివరకు త్రివిక్రమ్ గత సినిమాలకు సంబంధించి ఒక మూవీని మాత్రమే స్పూర్తిగా తీసుకుంటే ‘అల వైకుంఠపురములో’ విషయంలో రెండు సినిమాలకు కాపీ కొట్టాడా అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు అయితే త్రివిక్రమ్ బన్నీలు వ్యూహాత్మకంగా ‘అల వైకుంటపురములో’ కోసం చిరంజీవిని కూడ వదలకుండా వాడేసాడు అంటూ మెగా అభిమానులు జోక్ చేస్తున్నారు.
దీనికితోడు గత కొంతకాలంగా బన్నీకి మెగా అభిమానులకు మధ్య గ్యాప్ ఏర్పడటంతో ఆ గ్యాప్ ను ఫిల్ చేసి మెగా అభిమానుల సపోర్ట్ కూడ ఈమూవీకి పొందడానికి త్రివిక్రమ్ ఇలాంటి వ్యూహాలు అనుసరించి ఉంటాడు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఈ టీజర్ చివరన కోడి పుంజును పట్టుకున్న బన్నీని చూస్తుంటే తాను సంక్రాంతి కోడి పందేలాకు రెడీ అన్న సంకేతాలు ఇస్తున్నాడు అంటూ బన్నీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ టీజర్ కు కొనసాగుతున్న స్పందనను చూసి ఈ మూవీ బయ్యర్లు మంచి జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..