వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా నేడు ఎన్నో వివాదాలు మరియు నిరసనల అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవరాల్ గా మిశ్రమ స్పందనను రాబడుతున్న ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ, ఆంధ్రప్రదేశ్ లోని దాదాపుగా అందరు ప్రధాన పార్టీల అధినేతలను మరియు ముఖ్యమైన రాజకీయ నాయకులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అప్పటి టిడిపి పార్టీ ఆపడంతో ఒకింత ఆవేదన చెందిన వర్మ

 

అప్పటినుండి వారిపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తూనే ఉన్నారు వర్మ. ఇక నేడు ఆయన తీసిన ఈ సినిమాను పరిశీలిస్తే పూర్తిగా చంద్రబాబును మరియు ఆయన తనయుడు లోకేష్ ను వర్మ ఒక ఆట అడ్డుకున్నట్లు చెప్తున్నారు ప్రేక్షకులు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వెలుగుదేశం కేవలం 23 సీట్లు, అలానే వైసీపీకి 151 సీట్లు రావడంతో, ఆ క్షణంలో చంద్రబాబు మరియు లోకేష్ ని పోలిన వ్యక్తులు వెక్కి వెక్కి ఏడుస్తుండడంతో, చంద్రబాబు కోడలు రమణి ఆయనను మరియు భర్త లోకేష్ ను ఓదారుస్తున్న సీన్స్ సినిమాలో ఒకింత ఫన్నీగా అదరగొట్టిందని, ఆ సీన్ తో పూర్తిగా బాబుని మరియు లోకేష్ ని వర్మ ఒక ఆటాడుకున్నాడని అంటున్నారు. 

 

మూడు సార్లు ఆంధ్రకు ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు, రాష్ట్రం అభివృద్ధి మొత్తం నాతోనే జరిగింది, నేనే నూతన రాజధాని అమరావతిని నిర్మించా అంటూ కొన్ని డైలాగ్స్ తో బాబు పై సెటైరికల్ గా విరుచుకుపడ్డాడు. మొత్తానికి ఈ సినిమాలో వాళ్ళు, వీళ్ళు అని తేడాలేకుండా దాదాపుగా ముఖ్యమైన రాజకీయ నాయకులు ఎవ్వరినీ కూడా వర్మ వదలలేదని తెలుస్తోంది. మరి ఈ సినిమాపై రాబోయే రోజుల్లో ఆయా రాజకీయ పార్టీల నాయకులలు ఈ సినిమాపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: