విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఈరోజు విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని ప్రముఖుల పాత్రలను ఆధారంగా చేసుకొని ఆర్జీవీ తెరకెక్కించిన ఈ సినిమా సెటైరికల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. క్లైమాక్స్ లో ఆర్జీవీ కామియో ఎంట్రీ బాగుంది. క్లైమాక్స్ లో వర్మను జాఫర్ ఇంటర్వ్యూ చేస్తాడు. మధ్యంతర ఎన్నికల్లో జగన్నాథరెడ్డి పార్టీకి 174 సీట్లు రాగా బాబు గారి పార్టీకి కేవలం ఒకే ఒక సీటు వస్తుంది.
జాఫర్ వర్మను ఆ పార్టీకి ఎందుకు వన్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారని అడుగుతాడు. అతడి నిజాయితీకి ప్రజలే పట్టం కట్టారని అది నేను చెప్పడం లేదని వర్మ చెబుతాడు. జాఫర్ వర్మను అంత భారీ మెజారిటీ ప్రస్తుత ముఖ్యమంత్రికి ఎలా కట్టబెట్టారు అని ప్రశ్నిస్తాడు. రామ్ గోపాల్ వర్మ ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రజలు అతడి నిజాయితీని ఎంతగా నమ్ముతున్నారో అతడి మెజారిటీనే చెబుతుందని చెబుతాడు. దానిని అందరూ అంగీకరించాలని కూడా చెబుతాడు.
ఫస్టాఫ్ ను సీరియస్ నెస్ తో తెరకెక్కించిన వర్మ సెకండాఫ్ లో మాత్రం ఆ సీరియస్ నెస్ ను కొనసాగించలేకపోయాడు. రియల్ లైఫ్ క్యారెక్టర్లకు దగ్గరగా ఉండే పాత్రలను తీసుకోవటం, పేర్లు కూడా దగ్గరి పోలికలతో ఉండటం సినిమాకు ప్లస్ అయింది. పాత్రలను పోషించిన నటుల హావభావాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమాలో పాత్రల స్వభావాన్ని తెలపటంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది.
కేఏ పాల్ పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. మనసేన పార్టీ అధినేత ప్రణయ్ కళ్యాణ్ పాత్ర సినిమాలో కొద్దిసేపు మాత్రమే ఉంది. చాలా డైలాగులను సెటైరికల్ గా రాశారు. స్వప్న, కత్తి మహేష్, ధన్ రాజ్ పాత్రల పరిధిమేర నటించారు. బాబు, చినబాబు పాత్రలతో రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందించాడు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.