సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వివాదాస్పద సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దార్ధ తాతోలు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఒకింత మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇక ఈ సినిమాతో దాదాపుగా అందరు రాజకీయ పార్టీల నాయకులపై సెటైర్లు వేసిన వర్మ, చంద్రబాబు మరియు లోకేష్ లను మాత్రం ఒక ఆట అడ్డుకున్నట్లు చెప్తున్నారు ప్రేక్షకులు. గత ఏడాది తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆంధ్ర లో రిలీజ్ కానీయకుండా ఆపినందకు, వర్మ ఈ సినిమాతో చంద్రబాబు పై గట్టిగానే బదులు తీర్చుకున్నాడని కొందరు ప్రేక్షకులు అంటున్నారు.
ఇక ఈ సినిమా ప్రకారం, మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తరువాత చంద్రబాబు, లోకేష్ ల పరిస్థితి ఎలా ఉంది, ఓడిపోవడంతో వారు ఎంత బాధపడ్డారు తదితర అంశాలు తెరపై చూపించారు వర్మ. ఇక వారిద్దరితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేఏ పాల్, మరికొందరు టిడిపి నేతలను టార్గెట్ చేస్తూ వర్మ సినిమా తీయడం జరిగింది. ఇకపోతే సినిమాలో మనసేన ఎమ్యెల్యే అసెంబ్లీలో పలికే మాటలు ప్రేక్షకులకు ఒకింత గమ్మత్తుగా అనిపిస్తాయి. అసెంబ్లీలో ఆర్థికమంత్రి మాట్లాడుతుండగా, స్పీకర్ నిద్రవాస్థలో ఉంటాడు. అదే సమయంలో మనసేన పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉండగా కొందరు నవ్వుతారు.
అప్పుడు ఆ మనసేన పార్టీ ఎమ్మెల్యే, 1 నుంచి 151 అంటారు అధ్యక్షా, అఆగే 1 నుంచి 22 అంటారు, అయితే మా పార్టీ తరపున నేనే నెంబర్ వన్, కాబట్టి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండిని అంటాడు. జనసేన పార్టీ ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ ని ఉద్దేశించి ఈ ఫన్నీ సీన్ ని తీసినట్లు తెలుస్తోంది. ఈ రోజు బాగానే కలెక్షన్ రాబట్టిన ఈ సినిమా, రేపటి నుండి ఎంతమేరకు ప్రేక్షకుల అభిమానముతో ముందుకు సాగుతుందో చూడాలి.....!!