రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు వెంకటేశ్, యువసామ్రాట్ నాగచైతన్య నటించిన సినిమా వెంకీ మామ...కే ఎస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటించారు.. కాగా ఈ చిత్రం వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ రిలీజ్ అయింది.. వెంకటేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని సినిమా రిలీజ్ కావడంతో నాగచైతన్య, వెంకీ ఫ్యాన్స్ మంచి మార్కులు వేస్తున్నారు..

 

మొదటి షో కే ఈ చిత్రం మంచి టాక్ తో దూసుకుపో తుంది.. ఈ చిత్రం నుండి మొదటి నుండి ఏర్పడ్డ క్రేజ్ ఇప్పుడు ఈ సినిమా కు హైలెట్ అయింది.. గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. వెంకటేశ్ కామెడీ టైమింగ్ సినిమాకు హైలెట్ అయ్యింది.. అందుకే సినిమా సూపర్ హిట్ అయింది..ఈ సినిమాకు మెయిన్ హైలెట్ అంటే వెంకటేశ్ కామెడీ అని జనాలు అంటున్నారు.

 

మిలటరీ ఆఫీసర్ గా చైతన్య ఎమోషనల్ సన్నవేశాలు కూడా సినిమా ఓ మోస్తారు హైలెట్ అని చెప్పాలి... భారత సైనికులు గురించి చెప్పే ఈ సన్నివేశాలు ..ప్రేక్షకులను కాసేపు ఏడ్పించాయనే చెప్పాలి.ఈ నేపథ్యంలో సాగినా వెంకటేష్ డైలాగులు అందరినీ కంటతడి పెట్టించాయి..ఇంకా చైతన్య మామతో కలిసి చేసిన చిలిపి పనులు సినిమాకు హిట్ టాక్ నీ అందించింది..

 


అసలు విషయానికొస్తే ... వెంకటేశ్ పాయల్ మద్య చాలా లేట్ గా ప్రేమ చిగురించడం ఆ వయస్సు లో వెంకీ పసిపిల్లాడులా చేసిన అల్లరి సినిమాని రెంజును పెంచింది.. సినిమాలో వచ్చిన పాటలు అన్ని ప్రేక్షకులను అలా కట్టిపడేశాయి.. మొత్తానికి చైతుకు , వెంకీకి ఒక హిట్ సినిమా పడింది.. ఎన్నాళ్ళ నుండో హిట్ కోసం తపిస్తున్న హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ కి ఈ సినిమా హిట్ ఇచ్చింది.. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 3/5 రేటింగ్ పడిందట.. క్రిటిక్స్ కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ను ఇచ్చారు మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: