బుల్లితెర పై తనదైన వాక్చాతుర్యంతో గోల గోల చేస్తూ ఉంటుంది యాంకర్ శ్రీముఖి. గతంలో పటాస్ తో యాంకర్ రవి తో జోడిగా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది ఈ అమ్మడు. ఏకంగా పటాస్  టాప్ రేటింగ్లో దూసుకుపోవడంతో ఈ అమ్మడి క్రేజ్ కూడా  ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత ఏ సినిమా ఈవెంట్ లో  చూసిన శ్రీముఖి కనిపించేది. తన వాక్చాతుర్యం తన అందం అభినయంతో అందర్నీ ఆకట్టుకున్నది శ్రీముఖి. లేడీ యాంకర్లలో సుమ తర్వాత శ్రీముఖి దూసుకుపోయింది . ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చిన తనదైన స్టైల్లో యాంకరింగ్ తో రక్తికట్టించేది  శ్రీముఖి. ఇక ఆ తర్వాత ఈ అమ్మడు బిగ్ బాస్ కి వెళ్ళింది. 

 

 

 ఇక బిగ్ బాస్ కి వెళ్లి అక్కడ కూడా చాలా మంది ప్రేక్షకుల ను సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలుస్తుందని చాలామంది శ్రీముఖి అభిమానులు  భావించినప్పటికీ శ్రీముఖి మాత్రం కొద్దిలో టైటిల్  మిస్సయింది. అయితే బిగ్ బాస్ కి వెళ్ళిన తరువాత ఈ అమ్మడి క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది.ఇంకేముంది  బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత క్రేజీ ఆఫర్ లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. ఇక ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం శ్రీముఖి ఇంస్టాగ్రామ్ లో 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

 

 

 

 అయితే ఇన్స్టాగ్రామ్లో తనకున్న పాలోవర్ల  సంఖ్య చాలా తక్కువే అంటుంది ఈ అమ్మడు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో శ్రీముఖి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. దీంతో ఇంస్టాగ్రామ్ లో శ్రీముఖి పేరుతో వందకు పైగా ఫేక్ అకౌంట్లు పుట్టుకొచ్చాయి. ఏకంగా శ్రీముఖి అఫీషియల్ అకౌంట్ అన్నట్టుగానే ఆ  ఫేక్ అకౌంట్ లు  కూడా కనిపిస్తాయి. దీంతో శ్రీముఖి ని ఫాలో అవ్వాలి అనుకుంటున్న  అభిమానులు చాలా మంది ఆ ఫేక్ అకౌంట్ లనూ  అసలైన శ్రీముఖి అకౌంట్లు అనుకుని వాటికి ఫాలోవర్లు గా చేరిపోతున్నారు. అలా తన ఫేక్ అకౌంట్ లో కూడా ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. ఇలా తన ఫేక్ అకౌంట్లతో ఉన్న ఫాలోవర్స్ అందరూ కలిపి తన నిజమైన పాలొవర్స్  సంఖ్య ఎప్పుడో  50 లక్షలు దాటిపోయిందని ఈ అమ్మడు  చెబుతున్నది. మరి అది మాత్రం జరిగే పని కాదు కదా. ఫేమస్ సెలబ్రిటీ ఎవ్వరైన వారి పేరుతో   ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం ఈ మధ్య ఫ్రెండ్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: