సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించింది చిత్ర యూనిట్. ఈ శుభ వార్త ఏమిటి అనుకుంటున్నారా.. అదే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న  ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారు చేయడం జరిగింది. ఆరోజు ఎప్పుడు అని అనుకుంటున్నారా..  సరిగ్గా  సినిమా విడుదలకు ఆరు రోజుల ముందు అంటే జనవరి 5న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాలి అని నిర్ణయం తీసుకుంది చిత్ర బృందం.

 


ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ అనుకుంటున్నారా.. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అత్యంత భారీగా ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ  వేడుకకు సంబంధించి అన్ని వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది. సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా   ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్‌ను షేర్ చేయడం జరిగింది.  ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్  జనవరి 5న సాయంత్రం 5.04 గంటలకు మొదలు అవుతుంది అని తెలియచేయడం జరిగింది.

 

View image on Twitter


మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా  ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత బాగా అవకాశాలు ఇచ్చింది అనే చెప్పాలి.   ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడం గమనార్ధకమైన విషయం. త్వరలోనే షూటింగ్‌ను ముగించి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తాము అని బృందం తెలిపింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని తెలియచేయడం జరిగింది.

 


ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ లేడీ విజయశాంతి కూడా నటిస్తున్నారు. ఆమె దాదాపు13 ఏళ్ల తరవాత సినిమాల్లో పాత్ర పోషించడం జరుగుతుంది. మహేష్ సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ ఇమేజ్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయంది అని చెప్పాలి. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక అభిమానులు ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: