టాలీవుడ్ సినిమా పరిశ్రమకు 2002లో ఈశ్వర్ సినిమాతో హీరోగా రంగప్రవేశం చేసారు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి నట వారసుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తొలిసినిమా తోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రభాస్, ఆ తర్వాత మూడవ సినిమాగా తెరకెక్కిన వర్షం తో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నారు. ఇక ఆ తరువాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించి ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచిన ప్రభాస్,
2010-2020 దశాబ్దంలో అందరూ హీరోలకంటే ఒకింత అత్యద్భుతమైన హిట్స్ అందుకుని తిరుగులేని రారాజుగా నిలిచారు అనే చెప్పాలి. ముందుగా 2010 లో డార్లింగ్, 2011లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకున్నారు. ఆ తరువాత 2013లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మిర్చి సినిమాతో అతి పెద్ద కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నారు. ఆ తరువాత 2015లో ఏకంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, మరియు 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి 2 సినిమాల్లో హీరోగా నటించారు. ఇక అప్పట్లో ఆ సినిమాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
బాహుబలి ఓవర్ ఆల్ గా రూ. 650 కోట్లు కలెక్షన్ కొల్లగొట్టగా, బాహుబలి 2 రూ. 1900 కోట్ల కలెక్షన్ ని అందుకుని టాలీవుడ్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. ఇక ఆ రెండు సినిమాల సక్సెస్ ల తరువాత ప్రభాస్ కు బాలీవుడ్ హీరోల రేంజ్ ఫాలోయింగ్ లభించడం తో పాటు దేశ విదేశాల్లో కూడా ఆయన క్రేజ్, మార్కెట్ విపరీతంగా పెరిగాయి. కాగా అదే ఊపులో యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆయన తదుపరి సినిమా సాహోలో నటించిన ప్రభాస్, ఆ సినిమాతో పర్వాలేదనిపించుకునే విజయాన్ని అందుకున్నారు. అయినప్పటికీ ఆ సినిమా హిందీలో మాత్రం బాగానే కలెక్షన్ రాబట్టి, అక్కడ ప్రభాస్ రేంజ్ ని మరొక్కసారి చాటి చెప్పింది. సో ఈ విధంగా ప్రభాస్ ఈ దశాబ్దపు రారాజుగా వెలుగొందారు అని చెప్పవచ్చు.....!!