
గతంలో సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ ప్రస్తుతం మాత్రం రీజినల్ సినిమాలు కూడా హిందీ సినిమాలకు బాగా పోటిగా నిలుస్తూ ఉండడంతో ఉత్తరాది హీరోయిన్లు కూడా సౌత్ సినిమాల్లో నటించేందుకు ఎక్కువగా ఇంట్రస్ట్ ఉంది అని తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు సినిమాలో పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ బ్యూటీ మరో తెలుగు సినిమాకు కూడా సరే అని చెప్పడం గమనార్థకం.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం ఐనా అలియా ఇప్పుడు ఇంకో సినిమాకి కూడా సరే అని చెప్పింది. ఈ చిత్రంలో సీత పాత్రలో రామ్ చరణ్‌కు జోడిగా అలియా భట్ పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది అని తెలుస్తుంది.
ఇటీవల ఈ భామ మరో తెలుగు సినిమాకు ఓకె చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ భామ ఏ సినిమాకి సరే చెప్పింది అని అనుకుంటారా.. విభిన్న చిత్రాలతో హీరోగా తనకంటూ ఒక మంచి ఇమేజ్ తెచ్చుకున్న నటుడు అడివి శేష్. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం మేజర్‌లో అలియా కీలక పాత్రలో నటిస్తుందన్న వార్తలు వస్తూన్నాయి.
ఇక ఈ సినిమాకు మేజర్ సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాత వహిస్తున్నాడు. ఇన్ని రోజులు మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా కూడా అవ్వాలి అని అనుకుంటున్నాడు సూపర్ స్టార్. ఇక ఈ సినిమా మల్టీ లాంగ్వేజ్ మూవీగా వస్తుంది. సినిమా కావటంతో ఈ సినిమాలో కీలక పాత్రకు అలియాను కలిసి నాట్లు ప్రచారం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మా మూడు సినిమాలతో చాల బిజీగా ఉంది. బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషి ఫాంటసీ సినిమా బ్రహ్మస్త్ర సినిమాల్లో పాత్ర పోషిస్తుంది. ఇక మరి తెలుగు ప్రజలను మెప్పించిన ఉందో లేదో చూడాలి మరి.