క్రియేటివ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలవడం హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇది రాజకీయ సమావేశం కాదు, మహిళల రక్షణ కోసం తాను రూపొందించిన ప్రాజెక్టు ‘చైత్ర’ వివరాలను శేఖర్ కమ్ముల బాబుకు వివరించారు అని తెలుస్తోంది. శేఖర్‌కమ్ములతోపాటు, మధుర శ్రీధర్‌లు ప్రాజెక్టు చైత్రలో భాగస్వాములు గా ఉన్నారు.
మహిళలకు 24 గంటలపాటు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్‌ను వీరిద్దరూ రూపొందించారు. ఈ హెల్ప్‌లైన్‌కు ఎవరు ఫోన్ చేసి సమాచారమిచ్చినా అది వెంటనే పోలీస్, ఆసుపత్రి తదితర శాఖలకు ఏకకాలంలో చేరిపోతుందని శేఖర్ వివరణ చేసారట. వచ్చే ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోలో ఈ తరహా కార్యక్రమం ప్రకటించడం ద్వారా మహిళలకు భద్రత పెరిగే అవకాశముందని బాబుకు శేఖర్ కమ్ముల వివరించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘అనామిక' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. హిందీలో రీమేక్ అయిన ‘కహానీ' చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘అనామిక' చిత్రంలో టైటిల్ పాత్రలో నయనతార నటిస్తోంది అన్న విషయం తెలిసిందే.
శేఖర్ కమ్ముల తన పద్దతికి భిన్నంగా ఒక సినిమా రీమేక్ ను రూపొందించడం ఇదే మొదటిసారి. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో విడుదల కానుంది అని తెలుస్తోంది.