తొలి సినిమా rx100 తోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో పాయల్ కు మంచి గుర్తింపు వచ్చింది. rx100 సినిమాలో బోల్డ్ గా కనిపిస్తూనే అద్భుతమైన అభినయంతో పాయల్ అభిమానులను సంపాదించుకుంది. కానీ ఆ సినిమా హిట్ తో స్టార్ హీరోయిన్ గా మాత్రం పాయల్ ఎదగలేకపోయింది. పాయల్ సరైన కథలను ఎంచుకోకపోవటంతో పాయల్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతున్నాయి.
RX100 సినిమా తరువాత ఎన్టీయార్ కథానాయకుడు సినిమాలో చిన్నపాత్రలో పాయల్ నటించింది. ఆ సినిమాలో నటించిన పాత్ర పాయల్ కు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ఆ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన సీత సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది. హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో ఐటెం సాంగ్ లో నటించడం పాయల్ కెరీర్ కు మైనస్ గా మారింది. ఆ తరువాత పాయల్ ఆర్డీఎక్స్ లవ్ సినిమాలో నటించింది.
ఈ సినిమా డిజాస్టర్ కావటం, బోల్డ్ గా నటించిన పాయల్ పాత్రపై కూడా విమర్శలు రావడంతో పాయల్ ఇమేజ్ దెబ్బతింది. వెంకీ మామ సినిమాలో పాయల్ నటించినప్పటికీ ఆ సినిమా పాయల్ కెరీర్ కు పెద్దగా ఉపయోగపడే అవకాశం లేదు. ప్రస్తుతం పాయల్ చేతిలో రవితేజ హీరోగా నటిస్తున్న డిస్కోరాజా సినిమా మాత్రమే ఉంది. డిస్కో రాజా సినిమా ఫలితంపైనే పాయల్ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు.
డిస్కో రాజాలో పాయల్ తో పాటు నభా నటేష్ కూడా నటిస్తోంది. పాయల్ ఇలాంటి టైమ్ లో ఇకనుండి బోల్డ్ క్యారెక్టర్లు చేయకూడదని నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ నిర్ణయం పాయల్ కొన్ని నెలల ముందు తీసుకొని ఉంటే మాత్రం పాయల్ కెరీర్ మరో విధంగా ఉండేది. ఆర్డీఎక్స్ లవ్ సినిమాలో పాయల్ ను మరీ రోతగా చూపించడంతో పాయల్ ఇమేజ్ బాగా దెబ్బతింది. ఇప్పుడు పాయల్ బోల్డ్ సినిమాల్లో నటించనని తీసుకున్న నిర్ణయం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టుగా ఉందని చెప్పవచ్చు.