బిగ్ బాస్ షో అనేది జనాలను ప్రతి రోజూ ఎంటర్టై్మెంట్ చేస్తూ వస్తుంది అని చాలా మంది అనుకుంటారు..పైన పటారాం లోన లోటరం అన్నట్లు ఈ షో మాత్రం అందుకు భిన్నంగా మారింది..సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ 13వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ హౌస్ లవర్స్ పార్క్‌లా తయారైందని చెప్పొచ్చు.
ఒకప్పుడు కాట్ల కుక్కల్లా కొట్టుకున్న కంటెస్టెంట్లు ఇప్పుడు ముద్దులతో తెగ రొమాన్స్‌లు చేసుకుంటున్నారు. ఈ షోలో పాల్గొన్న బుల్లి తెర నటులు మధురిమా తులి, విశాల్ ఆదిత్య సింగ్ ఒకప్పుడు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు. హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా పాత గొడవలు మర్చిపోలేక ఇద్దరూ వారం రోజుల పాటు మాట్లాడుకోలేదు.
అప్పట్లో వారు అమరప్రిమికులు.. కానీ ఇపుడు మాత్రం షో లో గొడవ పడుతున్నారు.. కానీ ఈ షో లో ప్రేమ మళ్లీ మొగ్గ తొడిగింది..ఒకే బెడ్‌పై నిద్రపోయే వరకూ వచ్చింది. అంతేకాదు దుప్పట్లో దూరి మరీ ముద్దులు పెట్టుకుంటూ తెగ రొమాన్స్‌లు చేసుకుంటూ బిగ్ బాస్ కెమెరాలకు చిక్కారు. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఇదే విధంగా తనను సపోర్ట్ చేసి ఉంటే ఇలా విడిపోయేవాళ్లం కాదు కదా అంటూ తెగ కబుర్లు చెప్పుకున్నారు.
విశాల్, మధురిమ ప్రేమించి విడిపోయారని తెలుసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు వారిని కావాలనే హౌజ్‌లోకి పంపించారట. విడిపోయిన ప్రేమికుల మధ్య జరిగే సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయని మధురిమకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పించారు. అంతేకాదు షో కోసం ఇద్దరూ కలిసిపోవాలని చెప్పారట. అయితే బిగ్ బాస్ షోని లవర్స్ పార్క్‌లా మార్చేస్తున్నారని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒక అమ్మాయి, అబ్బాయి ఒకే బెడ్‌పై పడుకుని ఆ రాసలీలలు ఏంటి అంటూ సల్మాన్ ఖాన్‌ను ఏకిపారేస్తున్నారు. మరి ఈ షో ఇంకా సాగుతున్నా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి..