
కొత్త సంవత్సరం వచ్చినప్పుడల్లా ప్రభాస్ పెళ్ళి గురించి ఊహాగానాలు రావడం సర్వసాధారణం. అయితే ఈ ఊహాగానాలు ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచన ప్రాయంగా చెప్పిన మాటలు ప్రభాస్ పెళ్ళి పై సెటైర్లు పడేలా చేస్తోంది.
‘బాహుబలి’ కోసం ఐదేళ్లు ఆతర్వాత ‘సాహో’ కోసం రెండేళ్లు గడిచిపోయాయని అయితే ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘జాను’ పూర్తి అయిన తరువాత ప్రభాస్ పెళ్లి చేసే ఆలోచనలు ఉన్నాయి అంటూ తమ క్షత్రియ కులంలో బాగా చదువుకుని మంచి సాంప్రదాయం గల అమ్మాయిలు దొరకడం కష్టంగా ఉంది అన్న శ్యామలా దేవి మాటలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రముఖ సామాజిక వర్గంగా పేరు గాంచిన క్షత్రియ కులంలో ప్రభాస్ కు సరిపడే అమ్మాయి దొరకక పోవడం ఏమిటి అంటు కొందరు తమ ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు.
మరికొందరు అయితే ప్రభాస్ పెళ్లి పై తనకు ఎదురు అయిన ప్రశ్నకు ఏదో ఒక సమాధానం ఇవ్వాలి కాబట్టి శ్యామల దేవి ఇలా సమాధానం ఇచ్చి ఉంటారు కాని పెళ్లి విషయంలో ప్రభాస్ ఇంకా స్పష్టమైన నిర్ణయం ఇంకా ఏమితీసుకుని ఉండడు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు ప్రభాస్ లాంటి నేషనల్ సెలిబ్రిటీ నిజంగా పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయిలు దొరకడం అంత కష్టమా అంటూ జోక్ చేస్తున్నారు.
ఏది ఏమైనా కొత్త సంవతరం రాబోతున్న నేపధ్యంలో మళ్ళీ ప్రభాస్ పెళ్లి పై ఊహాగానాలు అందుకోవడంతో ఈ ఏడాది ముగింపులో ప్రభాస్ పెళ్లి వార్తలతో మీడియా హోరెత్తి పోతోంది. ప్రభాస్ కు ఎలాంటి అమ్మాయి కావాలో తనకు బాగా తెలుసునని తమది చాలా పెద్దకుటుంబం అని అలాంటి కుటుంబంలో కలిసిపోయే అమ్మాయి కోసం చూస్తున్నామని అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘జాన్’ తర్వాత ప్రభాస్ పెళ్లికి ముహూర్తాలు పెట్టేస్తామని ప్రభాస్ పెద్దమ్మ శ్యామల చెప్పిన మాటలు నిజం కావాలని ప్రభాస్ అభిమానులు దేముడికి మొక్కులు కూడ మొక్కుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి..