మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గత కొంత కాలంగా వివాదాలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. మా అధ్యక్షునిగా ఉన్న నరేష్ కి ఒక వర్గం... జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్ కి ఒక వర్గం గా ఏర్పడి మాలో వివాదాలు రగిలి పోతున్నాయి. ఇకపోతే తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 2020 డైరీ ఆవిష్కరణ  నేడు హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్ వేదికగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చిరంజీవి జయసుధ మోహన్ బాబు రాజశేఖర్,  పరుచూరి వెంకటేశ్వరరావు,  టి సుబ్బిరామి రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అందర్నీ కలుపుకుంటూ పోతూ అసోసియేషన్లో గొడవలు రాకుండా చూసుకోవాలని అంతే కాకుండా మంచి జరిగినప్పుడు అందరికీ చెబుతూ చెడు జరిగినప్పుడు చెవులో చెప్పుకొని సమస్యలను పరిష్కరించుకోవాలి అంటూ చిరంజీవి మాట్లాడారు

 

 

అనంతరం పరుచూరి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి మైక్ లాక్కుని మరీ హీరో రాజశేఖర్ మాట్లాడారు. చిరంజీవి గారు చెప్పింది అంతా బాగానే ఉంది  కానీ నిప్పు పెట్టినప్పుడు పొగ రాకుండా ఎలా ఉంటుంది అంటూ చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు రాజశేఖర్. చిరంజీవి వారిస్తున్నా కూడా అగ్రెసివ్  గా మాట్లాడారు రాజశేఖర్ . మీరు మాట్లాడేటప్పుడు నేను డిస్ట్రబ్ చేయలేదు నేను మాట్లాడేటప్పుడు కూడా మీరు డిస్టర్బ్ చేయకండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజశేఖర్. అయితే స్టేజిపైకి జయసుధ వచ్చి మైక్  తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా రాజశేఖర్ ఘాటుగానే ప్రసంగించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఏది ఫ్రాంక్ గా జరగలేదని... నేను సత్యంగా బతకాలి అనుకుంటున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

 

 

అంతేకాకుండా ముందుగా అందరికీ కాళ్ళు పెట్టుకుంటా  అంటూ అందరి దగ్గరికి వెళ్లి కాళ్ళు పట్టుకున్నారు రాజశేఖర్. ప్రస్తుతం రాజశేఖర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటివరకు మా అధ్యక్షుడిగా ఎంతోమంది మారినప్పటికీ టాలీవుడ్ పెద్దగా ఉన్న చిరంజీవికి మాత్రం ఎదురుగా మాట్లాడిన వారు మాత్రం లేరు. దీంతో ప్రస్తుతం రాజశేఖర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే రాజశేఖర్ కావాలని వచ్చి స్టేజ్ మీద అలా మాట్లాడారా అని అందరూ అనుకుంటున్నారు. మా లో జరుగుతున్న వివాదాల గురించి చిరంజీవి కి చెప్పడానికి రాజశేఖర అలా మాట్లాడారా లేకపోతే వేరే ఏదైనా ఉద్దేశం ఉందా అని పలువురు అనుకుంటున్నారు. లేదా ఇంకేదైనా కారణాల ద్వారా చిరంజీవి రాజశేఖర్ మధ్య కావాలని గొడవ అయిందా అని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏదిఏమైనా రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: