టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు, అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురములో సినిమాలు ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెల్సిందే. సరిలేరు నీకెవ్వరుకు వరుస సక్సెస్ ల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, అలవైకుంఠపురములో సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇటీవల ఈ రెండు సినిమాలకు సంబందించిన సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్లు యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది.
అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ ల విషయమై ఇటీవల రెండు సినిమాల నిర్మాతలు తమ సినిమాలను జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ విధంగా రెండు బడా సినిమాలు ఒకేరోజున రిలీజ్ అవ్వడం మంచిది కాదని దానివల్ల రెండు సినిమాలకు ఓపెనింగ్స్ పరంగా కొంత నష్టం జరుగుతుందని భావించిన కొందరు సినీ ప్రముఖులు, ఆయా నిర్మాతల మధ్య సుయోధ కుదిర్చి, ఫైనల్ గా సరిలేరు జనవరి 11న, అలానే ఆలా సినిమాను 12న రిలీజ్ చేసేలా డేట్స్ ఫిక్స్ చేసారు. అయితే మొన్నటి వరకు అంతా బాగుంది అనుకున్న సమయంలో సడన్ గా రెండు రోజుల క్రితం నుండి రెండు సినిమాలకు థియేటర్స్ కేటాయింపు విషయమై కొద్దిపాటి క్లాష్ రావడంతో మరొక్కసారి రెండు సినిమాల నిర్మాతలు రిలీజ్ డేట్స్ విషయమై వివాదాన్ని తెరమీదకు తెచ్చారు.
దానిని బట్టి రెండు సినిమాలు కూడా అయితే జనవరి 10న, లేదా 11న రిలీజ్ చేయాలని ఒకరిపై మరొకరు పోటీగా పట్టు పట్టినట్లు తెలుస్తోంది. ఇక మరొక్కసారి ఈ వివాదాన్ని పరిష్కరించడానికి రంగంలోకి దిగిన సినీ పెద్దలు, ఎట్టకేలకు కాసేపటి క్రితం రెండు సినిమాల నిర్మాతల మధ్య సయోధ్యను కుదిర్చి గతంలో ప్రకటించిన విధంగా సరిలేరును 11న అలానే అలవైకుంఠపురములో సినిమాను 12న రిలీజ్ చేసేలా ఒప్పించారు. దీనితో ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ సమసి పోయింది. మరి సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ రెండు సినిమాల్లో ఏది ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి....!!