టాలీవుడ్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. యువ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఏ వల్లభ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మరొక్కసారి భగ్న ప్రేమికుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ సరసన రాశి ఖన్నా, ఇజబెల్లీ, క్యథరీన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ సంపాదిస్తోంది. 

 

ఇక ప్రస్తుతం ఈ టీజర్ కు అత్యధిక స్థాయిలో వ్యూస్, లైక్స్ లభిస్తున్నాయి. నిజానికి ఈ టీజర్ కు యువత నుండి బాగానే రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కొందరు మాత్రం టీజర్ పై పలు విధాలుగా విమర్శలు చేస్తున్నారు. టీజర్ చూస్తున్నంత సేపు తమకు అర్జున్ రెడ్డి ఛాయలు చాలావరకు కనపడ్డాయని, ఎందుకంటే అందులో మాదిరి ఇందులో కూడా సెక్స్ సీన్స్, సిగరెట్ స్మోకింగ్, మందు కొట్టడం వంటి సీన్స్ తో మరొక్కసారి విజయ్ తన ఫ్యాన్స్ కి అర్జున్ రెడ్డిని గుర్తు చేసినట్లు ఉందని, అవితప్ప టీజర్ లో మరొకటి లేవని విమర్శిస్తున్నారు. నిజానికి గీత గోవిందం, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ వంటి డిఫరెంట్ మూవీస్ చేసిన విజయ్

 

మరొక్కసారి హిట్ కోసం ఈ విధంగా అర్జున్ రెడ్డి పంథాను విజయ్ అనుసరిస్తున్నట్లు కొంతవరకు అర్ధం అవుతోందని తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై కొందరు విజయ్ ఫ్యాన్స్ మాట్లాడుతూ, టీజర్ లో కొద్దిగా అర్జున్ రెడ్డి ఛాయలు కనపడొచ్చుగాని, మొత్తంగా సినిమా రిలీజ్ తరువాతనే ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పగలం అని, అందువలన టీజర్ తోనే పూర్తిగా సినిమాను జడ్జి చేయలేము అని అంటున్నారు. మరి వరల్డ్ ఫేమస్ లవర్ గా విజయ్ ఎంతమేర సక్సెస్ ని అందుకుంటాడో తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 14వరకు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: