తమ అభిమాన హీరో ని చూడాలని ఏ అభిమానులకు ఉండదు. ఈ నేపథ్యంలోనే తమ అభిమాన హీరో మహేష్ బాబు ను చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూసిన అభిమానులకు అందరికీ నిరాశే ఎదురైంది. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు  హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4:30 గంటలకే నగరానికి చేరుకున్నారు మహేష్ బాబు. అయితే ఆ సమయంలో మచిలీపట్నం వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుండడంతో ఆ కార్యక్రమం  ఎప్పుడు మొదలవుతుంది అన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే ఒకవేళ వర్షం తగ్గినా రాత్రి  10:00 వరకు ప్రోగ్రాం మొదలయ్యే పరిస్థితి లేదని నిర్వాహకులు స్పష్టం చేయడంతో... కార్యక్రమంలో హాజరుకావడానికి వచ్చిన మహేష్ బాబు తిరిగి వెళ్ళిపోయారు. 

 

 

 

 నేడు  హైదరాబాద్ వేదికగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో మచిలీపట్నం నుంచి హైదరాబాద్ బయల్దేరిన రాత్రంతా ప్రయాణం చేయాల్సి ఉంటుందని కాబట్టి మహేష్ బాబు వెళ్ళిపోయారు. దీంతో తమ అభిమాన స్టార్ హీరో ని చూడాలని వర్షంలో వేచిచూసిన అభిమానులందరికీ నిరాశ ఎదురైంది. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి  కాంబినేషన్లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా నేడు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుంది. 

 

 

 కాగా  సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల ముద్దుగుమ్మ రష్మిక నటిస్తుండగా... ఒక స్పెషల్ సాంగ్ లో  తమన్నా తన డాన్స్ లతో అదరగొట్టపోతుంది . ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజు రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటిస్తుండగా పదమూడేళ్ల తర్వాత టాలీవుడ్ అమితాబ్ విజయశాంతి సినిమాల్లోకి  రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కాగా  ఈ సినిమా విడుదల కోసం అభిమానులు అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు అనిల్  రావిపూడి లది హిట్  కాంబినేషన్ కావడంతో మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ షేక్ చేయడం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: