స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా అలవైకుంఠపురములో. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మ్యూజిక్ కన్సర్ట్ పేరుతో నిన్న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఎంతో వైభవంగా నిర్వహించారు. పలువురు సినిమా యూనిట్ సభ్యులతో పాటు సినిమాలోని పాటలను అన్నిటినీ ఈ కన్సర్ట్ లో పలువురు వాయిద్యకారుల బృందంతో ఆలపించి ప్రేక్షకులను కనువిందు చేసారు. 

 

ఇక ఈ వేడుకలో తన తండ్రి గొప్పతనం గురించి మాట్లాడుతూ కన్నీటిపర్యంతమైన అల్లు అర్జున్, ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని మన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరడం జరిగిన్ది. ఇక ఆ తరువాత ఫ్యాన్స్ అందరూ పవర్ స్టార్ అని అరుస్తుండడంతో, జై పవర్ స్టార్ అన్న బన్నీ, తనకు ఎంతో ఇష్టం, స్ఫూర్తి మాత్రం మెగాస్టార్ అని చెప్పి, ఒకింత పవన్ ఫ్యాన్స్ కు ఇబ్బందికలిగించాడనే అనాలి. కావాలనే పవన్ ను బన్నీ టార్గెట్ చేశాడని, అసందర్భంగా తమ హీరోను అవాయిడ్ చేసి, తన మనసులో ఉన్న ఉద్దేశ్యాన్ని బహిరంగంగా వ్యక్త పరిచాడని వారు అంటున్నారు. ఇన్నాళ్లూ నివురు గప్పిన నిప్పులా ఉన్న పవన్-అల్లు ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలు ఈ ఒక్క స్పీచ్‌తో మరింత రగులుకున్నాయని అంటున్నారు. 

 

ఎప్ప‌టి నుంచో ప‌వ‌న్‌ను, ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను కావాల‌నే టార్గెట్ చేస్తున్నాడ‌ని బన్నీ పై కొన్ని విమర్శలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. కావాలనే మెగాస్టార్ ని మాత్రమే పొగిడి, కేవలం పవర్ స్టార్ పేరు మాత్రం అలా చెప్పి, ఇలా వదిలేయడం, పవన్ పై అతడికి ఉన్న ద్వేషాన్ని కొంత బహిర్గతం చేసినట్లైందని విమర్శిస్తున్నారు.  కాగా ఈ న్యూస్ పై ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో చర్చ జరుగుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: