ఈ సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలయ్యాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన పాటలు ట్రైలర్ అని అభిమానల్లో  తెగ అంచనాలను పెంచేశారు. ఇక ఈ రెండు సినిమాలు ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నిన్న మహేష్ బాబు సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే... ఈరోజు అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. నువ్వానేనా అన్నట్టుగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి. 

 

 

 అయితే ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ రెండు సినిమాల హీరోయిన్ల విషయానికొస్తే. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన నటించగా.. ఇక  అల వైకుంటపురములో  సినిమాలో అల్లు అర్జున్ సరసన బ్యూటీ క్వీన్ పూజా హెగ్డే నటించింది. ఇద్దరు ముద్దుగుమ్మలు అందంలో ఎవరికీ వారే  సాటి. ఇద్దరికీ కొన్ని పోలికలు కూడా ఉంటాయని ప్రేక్షకులు అప్పుడప్పుడు అంటుంటారు. ఇక వరుస విజయాలతో ఈ ఇద్దరు భామలు టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. దర్శకులందరూ చూపు ఇద్దరి భామల పైన. 

 

 

 అయితే ఈ రెండు సినిమాల విషయానికొస్తే రష్మిక సరిలేరు నీకెవ్వరు  సినిమాలో మహేష్ బాబు పక్కన చిన్న పిల్లల తేలిపోయింది. క్యూట్ క్యూట్ యాక్టింగ్  చేయాలని రష్మిక మందన సరిలేరు నీకెవ్వరు సినిమా లో ప్రయత్నాలు చేసినప్పటికీ చూసే ప్రేక్షకులకు మాత్రం అది అతికే అతి యాక్షన్ అని అనిపించింది. దీంతో  సరిలేరు నీకెవ్వరు సినిమాలో  రష్మిక మందన్న యాక్టింగ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ అల వైకుంఠ పురములో మాత్రం పూజా హెగ్డే ప్రేక్షకులను మైమరిపించింది. పూజా హెగ్డే అందం అభినయంతో అదరగొట్టేసింది. ఈ సినిమాలో ఎంతో క్యూట్గా కనిపించింది. అయితే ఈ రెండు సినిమాల్లో  ఇద్దరికీ పెద్ద ప్రయారిటీ లేకపోయినప్పటికీ.. మహేష్ రష్మిక కాంబినేషన్ కంటే..  బన్నీ పూజా హెగ్డే కాంబో  ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించింది 

మరింత సమాచారం తెలుసుకోండి: