మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా ఈరోజు విడుదలైంది. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు హిట్ టాక్ వినిపిస్తోంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తిలాంటి హిట్ సినిమాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడు ఒక్కో సెంటిమెంట్ ఫాలో అవుతూ ఉంటారు. అలా దర్శకుడు త్రివిక్రమ్ కూడా తన ప్రతి సినిమాలో ఈ మధ్య కాలంలో ఒక సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోలకు స్థానచలనం ఉంటుంది. త్రివిక్రమ్ ఈ మధ్య కాలంలో తీస్తున్న సినిమాల్లో హీరో ఒక చోటు నుండి వేరే చోటుకు ప్రయాణించిన తరువాతే కథ మొదలవుతుంది.
అల వైకుంఠపురములో సినిమాకు కూడా త్రివిక్రమ్ అదే సెంటిమెంట్ ఫాలో అయ్యారు. కానీ త్రివిక్రమ్ ఈసారి అప్ గ్రేడ్ అయ్యారు. సినిమా మొదలైన 20 నిమిషాల వ్యవధిలో హీరో వేరే ఇంటికి వెళ్లిపోయి సొంతవాళ్లకు అజ్ఞాతవాసిలా మిగిలిపోతాడు. ఇది ఒక్కటే త్రివిక్రమ్ మిగతా సినిమాలకు అల వైకుంఠపురములో సినిమాకు తేడా...! మిగతా అంతా సేమ్ టూ సేమ్ అనేలా త్రివిక్రమ్ ఈ సెంటిమెంట్ ను సినిమాలో ఫాలోఅయ్యారు.
త్రివిక్రమ్ రొటీన్ కథనే ఎంచుకున్నప్పటికీ కథనంతో మరోసారి మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. మధ్య తరగతి వ్యక్తుల మనస్తత్వాన్ని త్రివిక్రమ్ చాలా సున్నితంగా చూపించాడు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా విడుదలైన తరువాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్నప్పటికీ అల వైకుంఠపురములో సినిమాతో ఇన్నిరోజులు తీసుకున్న గ్యాప్ తీస్తుకున్న లోటును అల్లు అర్జున్ భర్తీ చేశాడనే చెప్పాలి. ఫస్టాఫ్ కొంచెం నెమ్మదిగా సాగినా ఇంటర్వెల్ నుండి వేగం పుంజుకున్న సినిమా ద్వితీయర్థంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.