ఇటీవల వరుస పరాజయాలతో సతమతం అవుతున్న నందమూరి యువ హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా సినిమా ఎంత మంచివాడవురా సినిమా నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ ని సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. తన జీవితంలో జరిగిన ఒక ఘటన తరువాత ఇకపై జీవితంలో జరిగే ఎటువంటి విషయాన్ని అయినా పూర్తిగా పాజిటివ్ గా తీసుకునే యువకుడి పాత్రలో హీరో కళ్యాణ్ రామ్ నటించగా, ఆయన సరసన హీరోయిన్ గా మెహ్రీన్ నటించింది. ఇక స్క్రీన్ పై వీరిద్దరి జోడి ఎంతో బాగుందని, దర్శకుడు సతీష్ సినిమాని ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఎంతో బాగా తీసాడని అంటున్నారు.

 

ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ తో ఒక డిఫరెంట్ పాత్ర ట్రై చేశారని అంటున్నారు. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ బాగున్నప్పటికీ ఎంచుకున్న పాయింట్ కొంతవకు కనెక్ట్ అవ్వలేదని కూడా కొందరు అంటున్నారు. అలాగే ఆ ఆల్ ఈజ్ వెల్ రిలేటివ్స్ సప్లయర్స్ అనే సీన్స్ రిపీటెడ్ గా చూస్తున్న ఫీలింగ్ వలన మద్యలో సినిమా కొంత బోర్ కొడుతోందట. అయితే విలన్ ఎంట్రీతో కాస్త బెటర్ అయ్యిందని చెప్తున్నారు. సెకండాఫ్ కూడా బాగానే ఉందని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ తో పాటు ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగున్నాయని అంటున్నారు. 

 

ఇక కథ ప్రకారం చిన్ప‌ప్ప‌టి నుంచి అనాథ అవ్వ‌డం వల్ల ఎమోష‌న్లు స‌ఫ్లై అనే కంప‌నీ పెట్టుకుని అద్దెకు అన్న‌ల‌ను , అక్క‌ల‌ను సప్లై చేస్తుంటాడట హీరో. ఇది కథలో అంతగా క్లిక్ కాలేదని అంటున్నారు. అయితే ఓవర్ అల్ గా మాత్రం ఒక మంచి కథా బలం, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ వంటివి కోరుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుందని, దీనిని బట్టి ప్రస్తుతం సంక్రాంతి రేస్ లో ఉన్న సినిమాల్లో ఎంత మంచివాడవురా బెస్ట్ సినిమాగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు ప్రేక్షకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: