అల్లు అర్జున్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎంత సౌండ్ చేస్తాయో.. అతని మాటలు కూడా సోషల్ మీడియాలో అంతే ట్రెండ్ అవుతుంటాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే బన్ని స్పీచ్ లపై స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు. ఈ ఫోకస్ లోనే కొంతమంది నెగిటివ్ గా అర్థం చేసుకున్న సందర్భాలున్నాయి. అయితే వీటన్నింటికి సమాధానం చెప్పేశాడు పవన్ కళ్యాణ్.

 

అల్లు అర్జున్ స్టోరీస్ విషయంలో ఎంత పర్టిక్యులర్ గా ఉంటాడో, యూనిట్ కు థ్యాంక్స్ చెప్పడంలోనూ అంతే పక్కాగా ఉంటాడు. సినిమాలో ఆయనతో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరి గురించీ మాట్లాడతాడు. అయితే సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించకపోతే ఇద్దరి మధ్య ఏదో ఉందనే కామెంట్లు వినిపిస్తుంటాయి. 

 

అల వైకుంఠపురములో మ్యూజిక్ కన్సర్ట్ లోనూ ఇలాంటి సందర్భమే ఎదురైంది. ఇద్దరి మధ్యా ఏదో మిస్ అవుతుందనే కామంట్స్ వినిపించాయి. అయితే ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ రావడంతో బన్నికి కాంగ్రాట్స్ చెబుతూ ఓ బొకే పంపించాడు పవన్. ఈ స్పెషల్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేరే చేశాడు అర్జున్. 

 

పవన్ కళ్యాణ్ బొకే పంపించడం.. బన్నీ, పవన్ కు థ్యాంక్స్ చెప్పడంతో వీళ్ల మధ్య డిస్టెన్స్ ఉందనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందని అంటున్నారు సినీజనాలు. అయినా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య దూరం ఉందని ప్రచారం చేయడం, అభిమానుల్లో కన్ ఫ్యూజన్ క్రియేట్ చేయడం మానుకోవాలని కామెంట్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా పవన్, బన్ని మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం ఆగిపోతుందేమో చూడాలి. మొత్తానికి అల వైకుంఠపురములో హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో బన్ని ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ లో ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్.. బన్నీకి బొకే పంపించడం ఇరువురి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: