బాహుబలి సినిమాతో ఫాన్ ఇండియా హీరోగా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ .. ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నారు.. మొన్న వచ్చిన సాహో చిత్రం ప్రభాస్ ఇమేజ్ ను డ్యామేజ్ అయ్యేలా చేసింది .. దీంతో డార్లింగ్ కథల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు జాన్ సినిమాలో నటించారు..
ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది..ఇది ఇలా ఉండగా..రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 'బహుబాలి' సినిమా తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న 'సాహో' ఫ్యాన్స్ ను దారుణంగా నిరాశపరిచింది. దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం లో ప్రభాస్ తన తర్వాతి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.
సినిమా అప్డేట్ ఇవ్వండంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షాలు కురిపిస్తుండటంతో యూవీ క్రియేషన్స్ ప్రభాస్ 20అప్డేట్ ను రిలీజ్ చేసింది. ఫెస్ కనిపించకుండా ఎదో ఆలోచిస్తున్నట్టు ఉన్న ఒక ఫోటోని రిలీజ్ చేసారు. ఈ ఫొటోలో ఒక పియానో,పక్కనున్న గోడకు రకరకాల ఫోటోలు తప్ప ఏమిలేదు. దాంతో ఫ్యాన్స్ నిరాశకు గురైయ్యారు. అప్డేట్ అంటే లుక్ లేదా టైటల్ అనౌన్స్ చేస్తాడనుకుంటే ఇలా మొహం కనిపించని ఫోటోని విడుదల చేసారని ఫాన్స్ మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో తమదైన స్టైల్ లో కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. మొదట్లో ఈ సినిమాకు 'జాన్' అనే టైటల్ అనుకున్నప్పటికీ శర్వానంద్ నటిస్తున్న '96' రీమేక్ కు 'జాను' అని అదే టైటిల్ ను పెట్టారు. దాంతో ప్రభాస్ సినిమా పేరు ఏంటనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది...మరి ప్రభాస్ సినిమా ఇప్పటిలో విడుదల అయ్యేలా కనిపించడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..