ఒక సినిమా తీస్తే అది కళాత్మకంగా ఉండాలంటారు అనుభవజ్ఞులు. కాని ఇప్పుడు వచ్చే సినిమాలు అన్ని కళాత్మకంగా కాదు, కామాత్మకంగా ఉంటున్నాయనేది నిజం. ఆ సినిమాలో అసలు విషయం ఇది అని చెప్పుకోవడానికి ఏం ఉండదు. ఆ సినిమా చూసిన వారి ఆలోచనలు అపసవ్యంగా వెళ్లడం తప్పితే. ఇక ఈ మద్యకాలంలో నీలి చిత్రాలంటూ ప్రత్యేకించి ఏవి లేవు అన్నట్లుగా అన్ని విప్పి చూపించే హీరోయిన్స్ ఎక్కువ తయారైయ్యారు.

 

 

ఇలా ప్రస్తుతం ఎంతగా అందాలను ప్రదర్శిస్తే అంతగా ఫేమస్ అవ్వచ్చు అనే ఫిలాసఫి ఫాలో చేస్తున్నారు నేటి తరం నాయికలు. ఇకపోతే ఇప్పుడు వచ్చే కొన్ని సినిమాలకు సబ్ టైటిల్ అని పెడుతున్నారు. ఇక ఈ సబ్ టైటిల్ విషయంలో ఒక వికలాంగుడు కోర్టు మెట్లు ఎక్కాడట. అయితే అది మాములు సినిమాల కోసం కాదండోయ్.. పోర్న్ మూవీల కోస‌మ‌ట‌. అవును మీరు విన్నది నిజమే..

 

 

అమెరికాలో న్యూయార్క్‌లోని బ్రూక్‌లిన్‌ ఫెడరల్‌ కోర్టులో ఓ దివ్యాంగుడు గురువారం ఓ పిటిషన్ దాఖలు చేశాడు. అతని పేరు యారోస్లావ్‌ సూరిస్‌.. ఇతను పుట్టకతోనే చెవిటివాడు. ఇక తాము చెవిటివాళ్లం కావడం వల్ల అశ్లీల వీడియోలకు క్యాప్షన్‌ లేకపోవడంతో సాధారణ వ్యక్తుల మాదిరిగా వీడియోను ఎంజాయ్‌ చేయలేకపోతున్నామని పిటిషనర్ ఫిర్యాదులో పేర్కొనడమే కాకుండా, ఫోర్న్‌ వీడియోలు ప్రసారం చేసే ఫోర్న్‌హబ్‌, రెడ్‌ట్యూబ్‌, యూపోర్న్‌ వెబ్‌సైట్లతో పాటు కెనెడియన్‌ పేరెంటింగ్‌ కంపెనీ మైండ్‌గ్రీక్ మొదలగు ఈ వెబ్‌సైట్లు తమపై వివక్షత చూపుతున్నాయని,

 

 

అమెరికన్‌ వికలాంగుల చట్టాన్ని ఉల్లఘించి తమను మానసికంగా కృంగతీస్తున్నాయని పేర్కొంటు వీటిపై కేసు పెట్టాడు. అంతే కాకుండా ఫోర్న్‌ వీడియోలకు క్యాప్షన్‌ లేకపోతే చెవిటివారు ఆ వీడియోను ఎలా ఎంజాయ్ చేయగలరు. సాధారణ వ్యక్తుల మాదిరిగా మేము వీడియోను చూడలేం, అంటూ 23 పేజీల పిటిషన్‌లో సూరిస్‌ తెలిపాడు. ఇక కొసమెరుపు ఏంటంటే దీనిపై పోర్న్‌హబ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కోరీ ప్రైస్‌ స్పందిస్తూ తమ వైబ్‌సైట్‌లో క్లోజ్‌డ్‌ క్యాప్షన్‌ ఆప్షన్‌ ఉందని, దాన్ని ఎంచుకోవాలంటే అందులో ఉన్న లింక్‌ను క్లిక్‌ చేస్తే సరిపోతుందని చెప్పడం విశేషం..

మరింత సమాచారం తెలుసుకోండి: