దగ్గుబాటి వారసుడు రానా హీరోగా ప్రస్తుతం విరాటపర్వం సినిమా సెట్స్ మీద ఉంది. వేణు ఊడుగుల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా రానా తేజ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ తేజ డైరక్షన్ లో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ అందుకున్న రానా మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడు. సీత సినిమాతో ఫ్లాప్ అందుకున్న తేజ మళ్లీ తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
తేజ, రానా కాంబినేషన్ లో రాబోయే సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకు టైటిల్ గా రాకస రాజ్యంలో రావణాసురుడుగా పెట్టారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. సినిమాలో రానా మరోసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తాడని అంటున్నారు. ప్రస్తుతం క్రిప్ట్ పనిలో ఉన్న తేజ త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడని చూస్తున్నాడు.
ఈ మూవీకి సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది. వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర తరహాలో రానా రోల్ ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో రానాతో పాటుగా ఒక యువ హీరో కూడా ఉంటాడని అంటున్నారు. రానా, తేజ కాంబోలో రాబోతున్న ఈ రాక్షస రాజ్యంలో రావణాసురుడు సినిమా నేనే రాజు నేనే మంత్రి మ్యాజిక్ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటుగా గుణశేఖర్ డైరక్షన్ లో హిరణ్యకశ్యప సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీని కూడా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో కూడా రానా తన సత్తా ఏంటో చూపించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.