రవితేజ కొంతకాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు వి ఐ ఆనంద్ దర్శకత్వం లో నటిస్తున్నారు.. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలలో హీరో చేసే రచ్చ చేస్తున్నాడు..ఆ సినిమానే 'డిస్కో రాజా' .. ఈ రోజు విడుదల అయినా ఈ చిత్రం ప్రేక్షకుల్లో కొత్త ఉత్సహాన్ని క్రియేట్ చేస్తుంది. .మాస్ లుక్ తో వచ్చిన ఈ సినిమాలో రవితేజ ద్వీపాత్రాభినయం లో నటించారు..
ముందెన్నడూ లేని విదంగా రవితేజ ఈ సినిమాలో కనిపించారు .సైన్స్ ఫిక్షన్‌గా మంచి కమర్షియల్ కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.‘డిస్కోరాజా’కు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోయిన్లు. బాబీ సింహా ప్రతినాయకుడు పాత్ర పోషించారు. తమన్ సంగీతం సమకూర్చారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. గత కొంతకాలంగా హిట్స్ లేని రవితేజకు ఈ సినిమా హిట్ అయిందని అంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో రవితేజ లుక్, యాక్షన్ సన్నివేశాలు నచ్చడంతో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొత్తని హీరో లైన్లోకి వచనట్లే అని అర్థమవుతుంది.
డిస్కో రాజా రోల్ మినహా మిగిలిన దానిలో పెద్దగా మ్యాటర్ లేకపోవడం వలన ప్రేక్షకులు నిరాశతోనే బయటకి వస్తారు. ఓవరాల్ గా రవితేజ తన పంథా మార్చి చేసిన ఈ సినిమాలో డిస్కో రాజ్ గా కొంతవరకూ మెప్పించిన, అయన నుంచి కోరుకునే కామెడీ, మాస్ ఎలిమెంట్స్ లాంటివి మిస్ అవ్వడం వలన యావరేజ్ బొమ్మ డిస్కో రాజా అనే టాక్ ని తెచ్చుకుంటుంది. సైన్స్ ఫిక్షన్ అని చెప్పినా దాని ట్రీట్మెంట్ మాత్రం పాత చింతకాయ పచ్చడే అన్నట్టుగా ఉంది..మరి కలెక్షన్ల విషయం తెలియాల్సి ఉంది..