సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ‘లింగా’.  2014లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లింగా’ మూవీ  విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రజినీకాంత్ ద్విపాత్రాభినయంలో నటించారు.  ఒక పాత్రకు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా.  మరో పాత్రకు అందాల తార అనుష్క నటించారు.  ఈ మూవీ కె.ఎస్.రవికుమార్ డైరెక్ట్ చేయగా రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు.  ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. బయ్యర్లు భారీగా నష్టపోవడంతో వారితో రజినీ మాట్లాడి సెటిల్ మెంట్ చేసినట్లు టాక్. కెరీర్ పరంగానే కాదు రజినీకాంత్మూవీ వల్ల ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురుయ్యాయి.  ఇటీవల కాలంలో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఎన్నో టెన్షన్లు నెలకొంటున్నాయి. ముఖ్యంగా చిత్రం కథల విషయంలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.

 

అచ్చం ఇలాంటి ఇబ్బందే ‘లింగా’ మూవీకి ఎదురైంది. ఈ చిత్రం విడుదల సమయంలో స్టోరీ కాపీ కొట్టారంటూ డైరెక్టర్ రవిరత్నం మధురై కోర్టులో కేసు వేశారు. కథను తన ‘ముల్లై వానమ్ 999’ సినిమా నుండి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అప్పట్లో ఈ కేసు చాలానే దుమారం రేపింది. కోర్టు రూ.10 కోట్ల ఇన్సూరెన్స్ మీద చిత్రం విడుదలకు అనుమతించింది.  కాగా, ఈ చిత్రం రగడ కొంత కాలంగా కోర్టులో కొనసాగుతూ వస్తూనే ఉంది. 

 

ఇన్నాళ్ళు విచారణలో ఉన్న ఈ కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. కథ కాపీ కాదని తీర్పును వెలువరించింది. దీంతో నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కు పెద్ద ఊరట లభించినట్లైంది. ఈ సంక్రాంతి కానుకగా మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘దర్బార్’ మూవీ మంచి సక్సెస్ సాధించి ఇటీవల రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: