‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బష్టర్ కా బాప్ అంటూ ప్రచారం జరిగినా అందులోని వాస్తవాలు గుర్తించిన మహేష్ అభిమానులు ఏమాత్రం జోష్ లో లేరు. వాస్తవానికి ‘శ్రీమంతుడు’ తరువాత మహేష్ నటించిన ఏ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ కాలేదు. కేవలం ఫిగర్స్ మేనేజ్ చేస్తున్నారు అన్నది ఓపెన్ సీక్రెట్.

ఇలాంటి పరిస్థితులలో మహేష్ అభిమానులకు ఆకలి తీర్చే మరొక సినిమా విడుదల అవ్వడానికి మరో సంవత్సరం పైన పడుతుంది అని వస్తున్న వార్తలు మహేష్ అభిమానులకు షాకింగ్ న్యూస్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు వంశీ పైడిపల్లి మహేష్ తో మొదలు పెట్టబోతున్న మూవీ వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు మాత్రమే విడుదల అవుతుంది అని లీకులు వస్తున్నాయి. 

ఇప్పటికే ఈ విషయమై వంశీ పైడిపల్లి మహేష్ ల మధ్య లోతైన చర్చలు జరిగాయి అని ఈ సినిమా విషయంలో ఎక్కడా ఖంగారు లేకుండా తీరికగా తీయమని మహేష్ వంశీ పైదిపల్లికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు అని టాక్. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో మహేష్ పాత్ర జేమ్స్ బాండ్ తరహాలో ఉండే స్పై క్యారెక్టర్ అని తెలుస్తోంది.

ఇప్పటికే ఇలాంటి ప్రయోగం మురగ దాస్ మహేష్ మూవీ ‘స్పైడర్’ లో చేసి తీవ్ర నిరాశను మిగిల్చాడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రయోగాలు మహేష్ పై ఏమిటి అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు టాక్. అయితే ఈ సినిమాలో మహేష్ చాల స్టైలిష్ గా హాలీవుడ్ హీరో రేంజ్ లో కనిపించదానికి ఒక స్పెషల్ మేకోవర్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వంశీ పైడిపల్లిసినిమా రికార్డులు క్రియేట్ చేయలేదు. ఇలాంటి పరిస్థితులలో మహేష్ రికార్డుల దాహాన్ని ఎంత వరకు వంశీ పైడిపల్లి సరిపెట్టగలడో చూడాలి. అయితే వంశీ పైడిపల్లి ప్రయోగ వార్తలను మహేష్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: