శ్వేతాబసు ప్రసాద్ హృదయానికి గుడి కట్టాలి అంటున్నారు నెటిజన్లు. ఈమె చెబుతోన్నసమాధానాలు, లాజిక్ లకు సోషల్ మీడియా మొత్తం హీటెక్కిపోతోంది. శ్వేతా ఇంత ఓపెనా అని అదిరిపడుతున్నారు. ఇంతకీ శ్వేతా బసు ప్రసాద్ చెప్పిన సమాధానాలేంటో తెలుసా..!
శ్వేతాబసు ప్రసాద్ చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది. ఎలాంటి సిట్యువేషన్ అయినా సరే తాను అనుకున్నది చెప్పేసి వెళ్లిపోతుంది. డివోర్స్ విషయంలోనూ ఇలాగే మాట్లాడింది శ్వేతా. 2018 డిసెంబర్ లో అప్ కమింగ్ డైరెక్టర్ రోహిత్ మిట్టల్ ని పెళ్లి చేసుకున్న శ్వేతా 2019 డిసెంబర్ లో భర్తకు బ్రేకప్ చెప్పింది. విడాకులకు అప్లై చేసింది.
శ్వేతాబసు ప్రసాద్ స్టేట్ మెంట్ విని నెటిజన్లు అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంకావిడాకులే మంజూరు కాలేదు. అప్పుడే ప్రేమ గురించి మాట్లాడుతోంది. ఈమె ఇంత ఓపెన్ అయిపోయిందేంట్రా అని కామెంట్లు చేస్తున్నారు. అయితే శ్వేతా మాత్రం యాజ్ టీజ్ గా తన స్టైల్లో తాను వెళ్లిపోతోంది.
సినీ ఇండస్ట్రీలో కొందరు ప్రేమలో పడి విహరిస్తారు. చెట్టాపట్టాలేసుకొని తిరుగుతారు. నాకు నీవు.. నీకు నేనూ అంటూ డ్యూయెట్లు పాడుకుంటారు. రూమర్స్ వచ్చినపుడు సిల్లీగా కొట్టిపారేస్తారు. కెమెరాకు చిక్కినపుడు ప్రేమ గుట్టును విప్పేస్తారు. పెద్దల సమక్షలంలోనో లేకపోతే సీక్రెట్ గా పెళ్లిచేసుకొని అంతా అయిపోయిందని చెప్పేస్తారు. శ్వేతాబసు ప్రసాద్ కూడా అంతే లవ్ లో విహరించింది. డైరెక్టర్ రోహిత్ మిట్టల్ తో కలిసి ఏడడుగులు నటించింది. ఏమైందో ఏమో గానీ ఏడాది తిరిగే సరికి విడాకులకు నిర్ణయం తీసుకుంది. మళ్లీ కొత్తగా ప్రేమలో పడినట్టు పులకించిపోతుంది.
ఇదేంటి.. శ్వేత బసు ప్రసాద్ లో ఇంత మార్పా అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. పెళ్లయి ఏడాది తిరగక ముందే విడాకులకు అప్లై చేయడమేంటి.. అప్పుడే ప్రేమ గీతాలు పాడటమేంటని గుసగుసలాడుకుంటున్నారు. జరిగిన పరిణామాలపై ఆశ్చర్యపోతున్నారు.