అమలాపాల్ విడాకుల వ్యవహారం ఇంకా చల్లారడం లేదు. రెండేళ్ల నుంచి సోలోగానే బ్రతుకుతున్నా.. ఆ పాత గోల మాత్రం కొత్తకొత్తగా రేగుతూనే ఉంది. అమలను వార్తలకెక్కిస్తూనే ఉంది. లేటెస్ట్ గా అమల విడాకులకు ఓ హీరో కారణమని చెప్పి కోలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాడు విజయ్ తండ్రి.
అమలాపాల్ విడాకుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకునే పనుల్లో బిజీగా ఉంది. ఈ మధ్య ఆమె సినిమాలో చాలా బోల్డ్ గా నటించి జనాలను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ బోల్డ్ క్యారెక్టర్ కంటే.. ఇప్పుడు ఆమె విడాకులకు ధనుష్ కారణమేే ఆరోపణలే కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ధనుష్, అమలాపాల్ కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉందో.. వాళ్ల మధ్య ఫ్రెండ్ షిప్ కూడా అదే రేంజ్ లో ఉంది. ఈ స్నేహం కొద్దే పెళ్లి తర్వాత సినిమాలు పక్కనపెట్టి అమలని కెమెరా ముందుకు తీసుకొచ్చాడు. అమలాపాల్ భర్త ఎ.ఎల్.విజయ్ ను ఒప్పించి మరీ అమ్మ కనక్కు సినిమాలో లీడ్ రోల్ చేయించాడు. ధనుష్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో ఓ టీనేజీ అమ్మాయికి అమ్మగా నటించింది అమల. ఈ సినిమాతోనే కొడుకు కోడలు విడిపోయారని స్టేట్ మెంట్ ఇచ్చాడు విజయ్ తండ్రి అలగప్పన్.
అమల యాక్ట్ చేయడం మొదలుపెట్టగానే భార్యాభర్తల మధ్య దూరం పెరిగిందనీ.. విడాకులు తీసుకున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అలగప్పన్. అంతేకాదు ధనుష్ సినిమా ప్రస్తావన తీసుకురాకపోయి ఉంటే ఇలా జరిగేది కాదని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇక అలగప్పన్ ఆరోపణలతో అమల, ధనుష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మరి అమల, విజయ్ విడిపోవడానికి ధనుషే కారణమా అనేది తెలియాలి. మొత్తానికి అమల విడాకుల వ్యవహారం ఇపుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సమస్యకు ఎపుడు ఫల్ స్టాప్ పడుతుందో చూడాలి.