పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలంటే యువతలో క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే.. ఆ క్రమంలో చాలా మంది హీరోయిన్లు ఆయన సరసన నటించాలని మక్కువ చూపిస్తున్నారు. ఈ సందర్బంగా చాలా మంది పోటీ పడుతున్నారు. అజ్ఞాత వాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉండి ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ పింక్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా చెప్పలేదు. పూజా హెగ్డే, శృతి హాసన్ లాంటి పేర్లు వినిపిస్తున్న కూడా ఇంతవరకు కన్ఫర్మేషన్ అయితే రాలేదు.

 

అయితే పింక్ సినిమా రీమేక్ లో హీరోయిన్ ఎవరో తెలియదు కానీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మాత్రం అనుష్కతో పవన్ కళ్యాణ్ జోడి కట్టబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. భాగమతి సినిమా తర్వాత భారీ బ్రేక్ తీసుకుంది అనుష్క. ప్రస్తుతం ఈమె నిశ్శబ్దం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. ఒకప్పటిలా స్టార్ హీరోలు ఎవరు ఈమె వైపు చూడటం లేదు. కుర్ర హీరోలకు అనుష్క సరిపోయే ఫిజిక్ లేదు. దాంతో ఖాళీగా ఉండటం తప్ప ఇప్పుడు ఏమీ చేయలేకపోతుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలో అనుష్కకు అద్భుతమైన అవకాశం ఇచ్చేలా కనిపిస్తున్నాయి దర్శకుడు క్రిష్. పీరియాడికల్ సినిమా కావడంతో అనుష్క అయితే బాగుంటుందని భావిస్తున్నాడు ఈ దర్శకుడు.

 

గతంలో ఈమెతో వేదం లాంటి డిఫరెంట్ సినిమా చేశాడు క్రిష్. ఆ నమ్మకంతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం ఇస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది. ఫిబ్రవరి 3 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 2021 సంక్రాంతికి పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కానుంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే నిజంగానే పవన్ కళ్యాణ్ తో అనుష్క జోడి కడితే మాత్రం సినిమా బ్లాక్ బాస్టర్ అని అభిమానులు వెల్లడిస్తున్నారు. మరి ఈ వార్తలో ఏ మాత్రం నిజముందో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: