2006లో ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటి పూనమ్ కౌర్. అయితే తొలి సినిమాతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఆ సినిమా మాత్రం సక్సెస్ ని సాధించలేదు. ఇక ఆ తరువాత నుండి ఇటు తెలుగుతో పాటు అక్కడక్కడా కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటిస్తున్న పూనమ్ కు ఓవరాల్ గా కెరీర్ పరంగా విపరీతమైన గుర్తింపునిచ్చిన సినిమా అయితే లేదనే చెప్పాలి. ఇక ఇటీవల పెద్దగా అవకాశాల్లేని పూనమ్ కొద్దిరోజులుగా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తోంది. అలానే ప్రముఖులైన కొందరు మత ప్రభోదకుల్ని కూడా కలుస్తూ పలు సూక్తులు వల్లిస్తోంది. 

 

అయితే ఉన్నట్టుండి హఠాత్తుగా మళ్ళి ఆమె పాశ్చాత్య బాణీలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా తన ఎద అందాలు కనపడేలా ఆ ప్రాంతంలో ఒక టాటూ వేయించుకుని అందరికీ పెద్ద షాకిచ్చింది. అయితే పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న ఆ టాటూని బట్టి చూస్తే అందులో ఏదో మర్మం దాగి ఉందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్రిశూలం, త్రాచు పాము పడగను పోలి ఉన్న ఆ టాటూ యొక్క అంతరార్ధాన్ని గురించి పూనమ్ రివీల్ చేసింది. త్రిశూలం, తాచు పడగకు అర్థం సత్యం, ప్రేమ, కరుణ అని, అవి కలిగి ఉన్నపుడే మనిషి పరిపూర్ణమైన మానవుడు కాగలడని పెద్ద ట్విస్టే ఇచ్చింది. 

 

ఇక ఈ విధంగా ఆమె ఒక్కసారిగా టాటూ ఎవరి కోసం వేయించుకుంది అనే దానిపై కూడా పలు టాలీవుడ్ వర్గాల్లో ఎంతో చర్చ జరుగుతోంది. నిజానికి పూనమ్ పేరుతో ఇటీవల ఒక స్టార్ హీరోని, అలానే దర్శకుడిని టార్గెట్ చేస్తూ బయటికొచ్చిన కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ ఎంత సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే. అయితే ఆ టేపుల్లో ఉంది తన వాయిస్ కాదని, ఎవరో కొందరు తనపై కక్ష కట్టి కావాలనే తన గొంతుక మాదిరిగా మాట్లాడి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కొద్దిరోజుల క్రితం పూనమ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఆమెకు ఏ దర్శకుడు అవకాశం ఇస్తాడో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: