టాలీవుడ్ సినిమా పరిశ్రమకి రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర అనే సినిమా ద్వారా నటిగా పరిచయమైన రాధిక ఆప్టే, ఆ సినిమాలో తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ లెజెండ్ లో మెయిన్ హీరోయిన్ గా నటించిన నటించి మంచి పేరు సంపాదించింది. అలానే తరువాత మరొక్కసారి బాలకృష్ణ సరసన లయన్ అనే సినిమాలో నటించిన రాధిక ఆప్టే, అటు బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించింది. కొద్ది రోజుల క్రితం ఆమె ది వెడ్డింగ్ గెస్ట్ అనే హాలీవుడ్ సినిమాలో నటుడు దేవ్ పటేల్ తో కలిసి పాల్గొన్న శృంగార సన్నివేశం ఒకటి లీకై పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. 

 

అప్పట్లో దానిపై పెద్ద రచ్చే నడిచింది. అలానే ఆ మధ్య ఆమె నటించిన బాలీవుడ్ సినిమాలైన పార్చ్డ్, బద్లాపూర్ వంటి సినిమాల్లో రాధికా పలు శృంగార సన్నివేశాలతో పాటు  అక్కడక్కడా కొన్ని అర్ధ నగ్నంగా బోల్డ్ క్యారెక్టర్స్ లో ఏ మాత్రం బెరుకు లేకుండా నటించింది. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ రాధిక మాట్లాడుతూ, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే పూర్తి న్యూడ్ గా కూడా నటించటానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే మొదటి నుంచి ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొడుతూ మాట్లాడే రాధిక పై అక్కడి సినీ ఇండస్ట్రీలో కొంత నెగిటివ్ అభిప్రాయం కూడా ఉంది. 

 

ఇక క్యారెక్టర్ డిమాండ్ చేస్తే పూర్తి నగ్నంగా నటిస్తానని ఇటీవల రాధిక చేసిన సంచలన వ్యాఖ్యలపై ఇప్పటికీ కొందరు నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొందరు మహిళలు అయితే ఛీ ఛీ, ఎంత క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మాత్రం నగ్నంగా నటిస్తాను అంటూ అంత గర్వంగా చెప్పాలా రాధిక అంటూ ఆమెపై కామెంట్స్ రూపంలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఈ మ్యాటర్ గత కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: