యువ‌ర‌త్న‌న నంద‌మూరి బాల‌కృష్ణ‌కు గత ఏడాది ఏమాత్రం కలిసిరాలేదు. చేసిన మూడు సినిమాలు అతి దారుణంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర కథ ఆధారంగా తెరకెక్కిన రెండు సినిమాలు ఘోర‌మైన డిజాస్ట‌ర్లు అయ్యాయి. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాలు రెండూ ప్లాప్ అయ్యాయి. ఇక గతేడాది చివ‌ర్లో వ‌చ్చిన రూల‌ర్ సినిమా సైతం డిజాస్ట‌ర్ అయ్యింది. 

 

క‌మ‌ర్షియ‌ల్ కోణంలో చేసిన రూల‌ర్ కూడా ప్లాప్ అవ్వ‌డంతో బాల‌య్య ఇప్పుడు మ‌ళ్లీ  త‌న‌కు క‌లిసొచ్చిన బోయ‌పాటి శీనునే న‌మ్ముకున్నాడు. గ‌తేడాది సంక్రాంతికి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో విన‌య విధేయ రామ సినిమాను తెర‌కెక్కించి ఘోర‌మైన ప్లాప్ మూట‌క‌ట్టుకున్న బోయ‌పాటి ఇప్పుడు ఎలాగైనా బాల‌య్య‌తో సినిమాను సూప‌ర్ హిట్ చేసి స‌త్తా చాటాల‌ని క‌సితో ఉన్నాడు. ఇందుకోసం అదిరిపోయే స్క్రిఫ్ట్‌ను కూడా బోయ‌పాటి లాక్ చేశాడ‌ట‌.

 

ఈ సినిమాకి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య బాబు రెండు క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే చాలా మంది పేర్లు గతంలో చాలా వచ్చాయి. ఇక లేటెస్ట్ టాక్ ప్ర‌కారం ఇందులో హీరోయిన్ గా కంచె వంటి సినిమాలో నటించి మెప్పించిన ప్రగ్యా జైస్వాల్ ను తీసుకుంటున్నట్టు సమాచారం. 

 

ప్రగ్యా బాలయ్యతో కలిసి నటించడం ఇదే మొదటిసారి. కంచె తరువాత ఆమెకు మంచి విజయం లేదు. అయితే ప్ర‌గ్య బోయ‌పాటి జ‌య‌జాన‌కీ నాయ‌క సినిమాలో న‌టించింది. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ సినిమా అవ‌కాశాలు లేని ఆమెకు ఇప్పుడు బోయ‌పాటి ఇలా బాల‌య్య సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. మ‌రి ఈ సినిమాతో అయినా ఆమె రాత మారుతుందేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: