టాలీవుడ్ లో తక్కువ కాలంలో ఎక్కువ స్టార్డమ్ సంపాదించి సెన్సేషనల్ స్టార్ గా మారిపోయిన హీరో విజయ్ దేవరకొండ. యూత్లో ఎంతగానో క్రేజీ ఏర్పర్చుకొని ప్రస్తుతం టాలీవుడ్ లో హవా కొనసాగిస్తున్నాడు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో.. విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు కనిపించిన దానికంటే కాస్త భిన్నంగా కనిపించారు. ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెంచేసిన ఈ సినిమా నేడు ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటించారు. ఈ నలుగురు హీరోయిన్లలో ఒకరు ఐశ్వర్య రాజేష్. 

 

 

 వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఐశ్వర్య రాజేష్ పాత్ర ఎంతో కీలకంగా ఉంది. ఒక మధ్య తరగతి జీవనం గడిపే  భార్యగా ఐశ్వర్య రాజేష్ నటన అందర్నీ ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ ఎంతో కీలకం గా మారిపోయింది. మధ్యతరగతి భార్య పాత్రలో  ఐశ్వర్య రాజేష్ ఒదిగిపోయిన నటించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఐశ్వర్య రాజేష్ ఈ పాత్రతో నటిగా మరో మెట్టు ఎక్కినట్లు  కనిపిస్తోంది. ఇక ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే ఐశ్వర్య రాజేష్ నటనకు వందకు వందశాతం మార్కులు వేయొచ్చు అనడంలో సందేహం లేదు. ఇక  మధ్య తరగతి భార్య గా ఐశ్వర్య రాజేష్ ఇచ్చిన పర్ఫామెన్స్ ది బెస్ట్ అనే చెప్పాలి. 

 

 

 వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో... సినిమా మొత్తానికి ఐశ్వర్య రాజేష్ పాత్ర ఆ పాత్రలో ఆమె నటించిన తీరు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఏమోషనల్ సన్నివేశాల్లో కూడా బెస్ట్ ను అందించి తన నటనకు ప్రశంసలు అందుకునే ఎలా ఉంది ఐశ్వర్య రాజేష్. ఒక మధ్య తరగతి భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ చూపించిన అభినయ ముందు... పూజా హెగ్డే లు కియారా  అద్వానీ లాంటి హాట్ అందాలు కూడా సాటి రావు  అనుకుంటున్నారు ప్రేక్షకులు.ఇక ఈ సినిమాలో రాశిఖన్నా పర్ఫామెన్స్ కూడా బాగుంది అనే చెప్పాలి. ఇప్పటివరకు లిప్ లాక్ లకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం విజయ్ దేవరకొండ తో లిప్ లాక్ సీన్లలో తెగ నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: