బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాదున్ సినిమా రీమేక్ రైట్స్ ను నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి కొన్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా ఆ సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం నితిన్ భీష్మ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. అది పూర్తయ్యాక వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న రంగ్ దే సినిమా చేయనున్నాడు. దానితో పాటుగా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో సినిమా కూడా లైన్ లో ఉంది. ఈ సినిమాలతో పాటుగా అంధాదున్ రీమేక్ లో నటిస్తాడట్. ఈ రీమేక్ ను ఎవరి చేతుల్లో పెడితే బాగుంటుందా అన్న విషయంపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది.
మొన్నటిదాకా సుధీర్ వర్మకు డైరక్షన్ ఛాన్స్ ఇస్తారని అన్నారు. కాని ఆ ఛాన్స్ సుధీర్ వర్మ నుండి మేర్లపాక గాంధికి వచ్చినట్టు తెలుస్తుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన మేర్లపాక గాంధి ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ సినిమా తీయలేదు. రెండేళ్ల క్రితం నానితో కృష్ణార్జున యుద్ధం చేసిన మేర్లపాక గాంధి ఆ తర్వాత సినిమా చేయలేదు. లేటెస్ట్ గా అంధాదున్ రీమేక్ ఆఫర్ అతనికి ఇచ్చారట నితిన్ అండ్ కో. మేర్లపాక గాంధి అయితే ఈ సినిమాకు న్యాయం చేయగలుగుతాడని నితిన్ ఈ నిర్ణయానికి వచ్చాడట.
మరి సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న మేర్లపాక గాంధికి ఇదో గొప్ప అవకాశమని చెప్పొచ్చు. హిందీలో ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా కాబట్టి మేర్లపాక గాంధి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇదిలాఉంటే మొన్నామధ్య రామ్ చరణ్ కు కథ చెప్పే ఆలోచనలో మేర్లపాక గాంధి ఉన్నాడని వార్తలు వచ్చాయి. చరణ్ కి వినిపించినా కాదన్నాడో లేక అసలు చరణ్ కలిసే అవకాశం రాలేదో కాని ఆ తర్వాత మళ్లీ మేర్లపాక గాంధి పేరు ఇప్పుడు వినపడుతుంది.