నాచురల్ స్టార్ నాని హీరోగా తనని హీరోని చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా వి. నానిని హీరోగా చేయడమే కాదు జెంటిల్మెన్ సినిమాలో సగం హీరో సగం విలన్ గా చూపించిన మోహనకృష్ణ ఈ సినిమాలో పూర్తిస్థాయి విలన్ ను చేశాడు. నాని నెగటివ్ రోల్ లో చేస్తున్న ఈ 'వి' మూవీలో సుధీర్ బాబు పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందిచిన టీజర్ రీసెంట్ గా రిలీజైంది. టీజర్ చూస్తే నాని విలన్ గా ఆకట్టుకునేలా ఉన్నాడు. అయితే హీరోకి విలన్ కు తేడా ఏంటి..? హీరోకి బిల్డప్ ఉంటుంది.. క్యారక్టర్ ఉంటుంది.. విలన్ కు ఇవేవి ఉండవు.

 

అయితే నెగటివ్ పాత్ర చేస్తున్న నాని కోసం ఇంద్రగంటి బాగా కష్టపడినట్టు తెలుస్తుంది. టీజర్ లో నాని సోది ఆపు.. దమ్ముంటే నన్ను ఆపు అంటూ భారీ డైలాగులే కొట్టించాడు. విలన్ గా నాని బిల్డప్ కూడా బాగుంది. అయితే ఈ బిల్డప్ సినిమా మొత్తం క్యారీ అవుతుందా లేక మధ్యలో తానో విలన్ అని మర్చిపోయి నాని కామెడీ చేస్తాడా అన్నది ఆలోచించాల్సి వస్తుంది. అంతేకాదు విలన్ గా నాని ఎలా ఆకట్టుకుంటాడు. అసలు నానికి ఈ ప్రయోగం ఎందుకు చేయాలని అనిపించింది అన్న డౌట్స్ కు సమాధానం సినిమా వస్తేనే తెలుస్తుంది.

 

'వి' సినిమాలో నెగటివ్ రోల్ చేస్తున్న నాని కన్నా పోలీస్ గా నటిస్తున్న సుధీర్ బాబు రోల్ ఎక్కువ ఇంప్యాక్ట్ కలిగించేలా ఉంది. టీజర్ లో సుధీర్ బాబు లుక్ కూడా అదిరిపోయింది. నాని చేస్తున్న ఈ నెగటివ్ ఎక్స్ పెరిమెంట్ ఏమాత్రం సక్సెస్ అవుతుందో చూడాలి. విలన్ గా నాని పరిమితుల్లో చేశాడా లేక ఫుల్ టైం విలన్ గా విశ్వరూపం చూపించాడా అన్నది సినిమా చూస్తేనే కాని చెప్పలేం.  

మరింత సమాచారం తెలుసుకోండి: