టాలీవుడ్ అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక్క సినిమా చేస్తే చాలు అని భావించే నటీమణులు ఎందరో ఉన్నారు. ఇటు తెలుగు అటు తమిళ్, మలయాళం సహా బాలీవుడ్లో సైతం స్టార్ హీరోయిన్లు కూడా మహేష్ బాబు తో ఒక్క సినిమా అవకాశం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. మహేష్ పక్కన నటిస్తే చాలు నా జన్మ ధన్యం అయినట్లే అంటూ కొందరు హీరోయిన్లు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్త పరచిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇక మహేష్ తో ఒక సినిమా చేసిన హీరోయిన్ మరొకసారి తప్పకుండా నటించాలని కోరుకుంటూ ఉంటుంది.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఉన్న మహేష్ బాబు, సూపర్ స్టార్ స్టేటస్ కు ముమ్మూర్తులా అర్హులని, ఎందుకంటే సెట్లోనే లైట్ బాయ్ దగ్గర్నుండి దర్శకుడు వరకు ప్రతి ఒక్కరిని ఆయన ఒక సాధారణ వ్యక్తి వలె అందరినీ ఎంతో ప్రేమతో పలకరిస్తారని, అలానే ఎప్పుడైతే కరెక్ట్ గా షూటింగ్ లో తన షాట్ మొదలవుతుందో, ఆ వెంటనే ఆయన సినిమా మూడ్ లోకి వెళ్లిపోతారని, మళ్లీ షార్ట్ ఫినిష్ అవ్వగానే షూటింగ్ లోని వారందరితో హాయిగా నవ్వుతూ కబుర్లు చెబుతారని వారు చెప్పడం జరిగింది. ఇక గతంలో మహేష్ బాబుతో రెండు సార్లు నటించిన ఒక స్టార్ హీరోయిన్ ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు కొంత ఆసక్తికరంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె గతంలో మహేష్ తో కలిసి నటించిన రెండు సినిమాల్లో ఒకటి పెద్ద హిట్ కాగా, మరొకటి ఫ్లాప్ అయ్యింది.
మీరు ఇప్పటి వరకు మహేష్ బాబు తో రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు కదా, ఒకవేళ మళ్లీ మీకు ఆయనతో నటించే అవకాశం వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, మహేష్ బాబుతో నటించడం ఎంతో హ్యాపీగా ఉంటుంది, సెట్లో అందరితో కలుపుగోలుగా ఉంటూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే మహేష్ తో మళ్లీ మళ్లీ వర్క్ చేయాలని నేను మాత్రమే కాదు, ప్రతి ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. కాకపోతే ఆయనతో నటించాలంటే ఒకటే భయం, అదేమిటంటే ఆయన పక్కన నటించే హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఆయన తన అందంతో వారిని డామినేట్ చేస్తారు, అందుకే ఆయనతో కలిసి నటించలేను బాబోయ్ అంటూ సరదాగా చెప్పుకొచ్చిందట. ఇక ప్రస్తుతం ఈ వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతుండగా, ఇంతకీ ఎవరబ్బా ఆ హీరోయిన్ అంటూ మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా పలువిధాలుగా ఆలోచనలు మొదలెట్టేశారు......!!