అక్కినేని వారింటి కోడలు సమంత, ఇటీవల నాగచైతన్యతో వివాహం తరువాత సినిమాలు కొనసాగిస్తున్నప్పటికీ, కథల ఎంపిక విషయంలో మాత్రం ఎంతో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇక వివాహం తరువాత ఆమె నటించిన సినిమాలు చాలావరకు మంచి సక్సెస్ సాధించాయి అనే చెప్పాలి. తన భర్త చైతన్యతో కలిసి ఆమె నటించిన మజిలీ సూపర్ హిట్ కొట్టగా, ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ గా వచ్చిన యుటర్న్, ఓ బేబీ సినిమాలు కూడా మంచి సక్సెస్ లు అడ్డుకోవడంతో పాటు సోలో హీరోయిన్ గా తన సత్తా ఏంటో సమంత ఆ సినిమాల ద్వారా చూపించింది.
అయితే అదే సమయంలో ఫస్ట్ మాన్ అనే వెబ్ సిరీస్ ని కూడా ఒప్పుకున్న సమంత, దాని అనంతరం దిల్ రాజు నిర్మాతగా సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జాను సినిమాలో హీరోయిన్ గా నటించింది. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందనను రాబట్టింది. రెండేళ్ల క్రితం తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన 96 అనే మూవీకి అధికారిక రీమేక్ గా తెరకెక్కిన జాను, ఒక హృద్యమైన ప్రేమకథ. కొన్నేళ్ల క్రితం 10వ తరగతిలో ప్రేమించుకున్న యువ ప్రేమ జంట, అదే సమయంలో అనుకోని కారణాల వలన విడిపోవడం, ఆపై కొన్నేళ్లు గడిచాక, అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ కలయికలో కలవడం జరుగుతుంది.
అయితే ఎన్నో ఏళ్ల తరువాత కలిసిన ఆ జంట మధ్య భావోద్వేగాలు ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్ తో మంచి కథనంతో తెరకెక్కిన ఈ సినిమాకి టాక్ బాగానే వచ్చినప్పటికీ, అంతకుముందే 96 రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టడంతో ఆ సినిమాని చాలామంది చూసేసి ఉండడంతో పాటు, సెకండ్ హాఫ్ లో కొంత నెమ్మదిగా సాగె కథనం, అలానే ముఖ్యంగా మన ప్రేక్షకులు ఆశించే కమర్షియల్ హంగులు ఏమాత్రం లేకపోవడం వంటివి ఈ సినిమాకు దెబ్బేశాయి. మొత్తంగా కొంత వరకు నష్టాలు మిగిల్చిన ఈ సినిమా ఇచ్చిన ఫలితంతో కొంత కృంగిపోయిన సమంత ఛ, ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది, చేసాక ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదంటూ తనలో తానే కొంత బాధపడుతోందట. నిజానికి యూనిట్ మొత్తం కూడా జాను సినిమా ఎంతో సక్సెస్ అవుతుందని భావించినప్పటికీ, ఈ విధంగా ఊహించని రీతిలో నష్టాలు మిగిల్చి డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బంది పెట్టినట్లయిందని సమంత తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తోందట....!!