సినీ ఇండస్ట్రీలో స్టార్ గా వెలగాలంటే ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి నిలవాలి. మరెన్నో డేరింగ్ డెసిషన్స్ తీసుకోవాలి. కొన్నిసార్లు ఎమోషన్స్ ని రిలేషన్స్ కూడా వదులుకోవాల్సి వస్తోంది. రాశిఖన్నా తీసుకున్న అలాంటి డేరింగ్ స్టెప్పే ఇప్పుడు ఆ బ్యూటీని స్టార్ హీరోయిన్ గా నిలబెట్టిందట. ఈ బ్యూటీ డిప్రెషన్ ను జయించి మరీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయినట్టు తెలుస్తోంది.
సినీ రంగుల ప్రపంచంలో మెరిసిపోవాలని ఎంతో మంది ఆశపడతారు. కానీ కొందరిని మాత్రమే అవకాశాలు వరిస్తాయి. అలా వరించిన ఛాన్స్ ల కోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తోంది. అలా సినిమాల కోసం రాశీఖన్నా ఏకంగా ఫ్యామిలీనే శాక్రిఫైజ్ చేయాల్సి వచ్చిందని చెబుతోంది. హీరోయిన్ గా వెలిగిపోవాలనే తన డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేయడానికి ఈ బ్యూటీ పేరెంట్స్ ను వదులు కోవాల్సి వచ్చిందని చెబుతోంది.
రాశీఖన్నా హీరోయిన్ కావాలనుకున్నప్పుడు ఈ బ్యూటీ పేరెంట్స్ నో చెప్పారట. అమ్మాయిలకు సినీ ఇండస్ట్రీలో సేఫ్ ఉండదని అడ్డు చెప్పారట. కానీ ఈ బ్యూటీ పేరెంట్స్ మాటలు పట్టించుకోకుండా ఇంట్లో నుండి వచ్చేసి అవకాశాలు పట్టేసినట్టు చెబుతోంది. ఆ టైమ్ లో తల్లిదండ్రులను ఎదురించి వచ్చాననే బాధతో ఈ బ్యూటీని డిప్రెషన్ లోకి వెళ్లిందట. ప్రతీరోజు ఏడ్చేదానినని చెబుతోంది. కానీ కెరీర్ లో ఇలాంటివన్నీ కామన్ అని అర్థమయ్యాక ఈ బ్యూటీ సినిమాలపై ఫోకస్ చేసిందట.
రాశీఖన్నా ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలని చెబుతోంది. పేరెంట్స్ చెప్పగానే ఇంట్లో ఉండిపోయి బాధపడితే హీరోయిన్ అయ్యేదాన్ని కాదని బొద్దుగుమ్మ చెబుతోంది. హీరోయిన్ గా సక్సెస్ కావడంతో ఈ బ్యూటీ పేరెంట్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. ప్రస్తుతం రాశీఖన్నా అమ్మానాన్నలతో సంతోషంగా ఉందట. రీసెంట్ గా వరల్డ్ ఫేమస్ లవర్ లో రాశీఖన్నా నటించింది. థర్టీప్లస్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ పెళ్లి ఆలోచనలు చేస్తోందో లేదో మరి.