ఒకప్పుడు బుల్లితెర మీద తన అల్లరి యాంకరింగ్ తో అలరించిన లాస్య పెళ్లి తర్వాత స్మాల్ స్క్రీన్ పై కనిపించడం మానేసింది. సోషల్ మీడియా ఇంత స్పీడ్ అందుకున్న తర్వాత కూడా టివి ఛానెల్ లో చేయడం దేనికి సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ పెడితే పోలా అనే ఆలోచన వచ్చింది. క్షణం ఆలోచించకుండా లాస్య టాక్స్ అంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన లాస్య అందులో తన టాలెంట్ చూపించేస్తుంది. భర్త మంజునాథ్ సపోర్ట్ తో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తుంది లాస్య. 

 

లాస్య టాక్ స్టార్ట్ చేయడమే ఆలస్యం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తన స్మాల్ స్క్రీన్ ఫ్యాన్స్ అందరు లాస్య టాక్స్ ఛానెల్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. లాస్య టాక్స్ ఛానెల్ ఇప్పటికే 2 లాక్ సబ్ స్క్రైబర్స్ తో సూపర్ హిట్ అయ్యింది. ఇక దీనిలో లాస్య వంటల దగ్గర నుండి అన్ని చేస్తుంది. లేటెస్ట్ గా లాస్య మొగుళ్లు వాళ్ల అబద్ధాలు అంటూ ఓ వీడియో పెట్టింది. భార్య దగ్గర భర్త చెప్పే చిన్న చిన్న అబధాలతో లాస్య చేసిన ఈ వీడియో అదిరిపోయింది. 24 గంటలు ముగియకుండానే ఈ వీడియోకి 100కె వ్యూస్ వచ్చాయి.  

 

లాస్య బుల్లితెరకు దూరమైందని బాధపడుతున్న వారంతా ఆమె కనీసం యూట్యూబ్ ఛానెల్ లో అయినా కనిపిస్తున్నందుకు సంతోషిస్తున్నారు. లాస్య టాక్స్ లో అవునంటే కాదనిలే కొత్త కాన్సెప్ట్ వీడియోస్ తో వచ్చిన రెండు ఎపిసోడ్స్ సూపర్ క్లిక్ అయ్యాయి. అయితే ఈ షో వల్ల భార్య దగ్గర మేనేజ్ చేస్తూ అబద్ధాలు చెప్పే భర్తలు మాత్రం పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టడానికే లాస్య ఈ షో చేస్తుందని సరదా కామెంట్స్ పెట్టేస్తున్నారు. మరి ఈ అమ్మడు ఇక ఇలానే యూట్యూబ్ ఛానెల్ కే పరిమితం అవుతుందా లేక స్మాల్ స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: