ఒకప్పుడు ప్రేమకథల దర్శకుడిగా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన తేజ కొన్నాళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. కొన్నాళ్లుగా కెరియర్ లో వెనుకపడ్డ తేజ రానా హీరోగా చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సత్తా చాటాడు. ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కినట్టు అనిపించినా సీత సినిమాతో మళ్లీ ఫ్లాప్ అందుకున్నాడు తేజ. తను చేసే సినిమాలన్ని సూపర్ హిట్లు కొడతాడనే నమ్మకంతోనే చేస్తానని తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇదిలాఉంటే తేజ తన బర్త్ డే సందర్భంగా రెండు సినిమాలు ఎనౌన్స్ చేశాడు.    

     

ఈమధ్య గోపిచంద్ హీరోగా తేజ డైరక్షన్ లో ఒక సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. గోపిచంద్ తో పాటుగా రానాతో కూడా ఒక సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు తేజ. ఈ రెండు సినిమాల టైటిల్స్ ను ఎనౌన్స్ చేశాడు తేజ. అందులో ఒకటి అలిమేలుమంగ వేంకటరమణ, రెండోది రాక్షస రాజు రావణాసురుడు. ఈ టైటిల్స్ లో ఏది ఎవరికి అన్నది తెలియాల్సి ఉంది. రానా కోసం అలిమేలుమంగ వేంకటరమణ.. రాక్షస రాజు రావణాసురుడు టైటిల్ గోపిచంద్ కోసమని తెలుస్తుంది.  

 

రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కు వ్యతిరేకంగా తేజ ఆర్.ఆర్.ఆర్ టైటిల్ పెట్టడం సర్ ప్రైజ్ గా ఉంది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కు పూర్తి పేరు తెలియదు కాని రాకస రాజు రావణాసురుడు అంటూ షాక్ ఇచ్చాడు. మరి రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ క్రేజ్ ను వాడుకునేందుకు తేజ ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. బర్త్ డే నాడు సర్ ప్రైజ్ చేసిన తేజ ఈ రెండు సినిమాలతో ఎలాంటి షాక్ ఇస్తాడో చూడాలి. గోపీచంద్ కూడా తేజ డైరక్షన్ లో సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.
  

మరింత సమాచారం తెలుసుకోండి: