హాలీవుడ్ సూపర్ స్టార్ జార్జ్ క్లోనీ, ఆయన భార్య అమల్ క్లోనీలు ఎంతో ముచ్చట పడి కొనుకున్న ఓ భారీ భవంతి వరదల్లో తీవ్రంగా దెబ్బతింది. ఇంగ్లాండ్‌లోని డెన్నిస్ స్ట్రక్ రీజన్‌లో ఈ భవంతి ఉంది. 93 కోట్ల 45 లక్షల విలువ చేసే ఈ భవంతిలో ఓ భారీ బాస్కెట్ బాల్ కోర్ట్‌తో పాటు ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజాగా వరదల్లో ఉన్న క్లోనీ మ్యాన్సన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ పరిస్ధితిపై స్పందించిన జార్జ్ తాము సురక్షితంగానే ఉన్నట్టుగా వెల్లడించాడు.
అర్కిటెక్చరల్ డైజెస్ట్ అంధించిన వివరాల ప్రకారం జార్జ్, అమల్ లు 17వ శతాబ్దానికి చెందిన ఓ భారీ భవంతి 2014లో వారి వివాహం అయిన తరువాత కొనుగోలు చేశారు. ఈ భవంతి థేమ్స్ నది మధ్యలో ఉన్న నాలుగు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఓ ద్వీపంలో ఉంది. అయితే ఇటీవల వేల్స్, ఇంగ్లాండ్ ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించటంతో తీవ్రంగా నష్టం జరిగింది.
ఇంగ్లాండ్‌లో సాధారణ వర్షపాతానికి మించి దాదాపు 121 శాతం అధిక వర్షం నమోదైనట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షం కారణంగా ఇంగ్లాండ్‌లోని నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన నదులు వరదల విషయంలో సరికొత్త రికార్డ్‌లు సెట్ చేశాయి. జార్జ్ క్లోనీ చివరగా 2016లో రిలీజ్ అయిన మనీ మాన్సస్టర్ చిత్రంలో నటించాడు. ఈ సినిమాకు జూడీ ఫోస్టర్ దర్శకుడు. జూలియా రాబర్ట్స్, జాక్ కోనెల్,డోమినిక్ వెస్ట్‌లు కీలక పాత్రల్లో నటించారు.