తెలుగు ఇండస్ట్రీలో వరుస హిట్స్ తో దుమ్మురేపుతున్నాడు మహష్ బాబు. భరత్ అనే నేను, మహర్షి తర్వాత ఈ సంక్రాంతికి అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా మంచి లాభాలు రాబట్టింది. సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్ సమయంలోనే మహర్షి లాంటి చిత్రంతో తనకు మంచి విజయాన్ని అందించిన వంశి పైడిపల్లి తో మరో చిత్రానికి కమిట్ అయ్యారట మహేష్ బాబు. కానీ ఈ చిత్రం క్యానల్స్ అయినట్లు వార్తలు వచ్చాయి. వంశి పైడి పల్లి వినిపించిన స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో మహేశ్ ను సంతృప్తి పరచలేకపోయింది. దాంతో ఆయన పూర్తిగా మార్పులు చేర్పులు చేసి తీసుకు రావాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈలోగా గీతాగోవిందం డైరెక్టర్ పరుశరామ్ తో ఓ చిత్రం చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్లు తెలుస్తుంది.
గతంలో ఆయన ఓ కథ వినిపించడం.. మహేష్ బాబుకి నచ్చనడం కూడా జరిగిందట. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. గతంలో ‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన శ్రీను వైట్లతో ఓ చిత్రం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంతో మహేష్ తనలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసి కడుపుబ్బా నవ్వించాడు శ్రీను వైట్ల. దూకుడు లాంటి మంచి విజయాన్ని అందుకోవడంతో అదే నమ్మకంతో 'ఆగడు' చిత్రానికి ఓకే చెప్పాడు మహేష్ బాబు. కానీ ఈ చిత్రం పరమే చెత్త అంటూ ప్రేక్షకులు తిరస్కరించారు.
మహేష్ బాబు కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో మరోసారి ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని అప్పట్లో మహేష్ బాబు ఫ్యాన్స్ సూచించారు. అయితే మహేష్ శ్రీను వైట్లతో ఓ చిత్రం చేస్తున్నాడని, ఇటీవల మహెష్ కు శ్రీను లైన్ వినిపించాడని బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వామ్మో ఇది నిజంగా రూమర్ అయితే బాగుంటుందని అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. అయితే ఇలాంటి వార్తలు అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తేనే నమ్మాలి.. ఇవన్నీ ఒట్టి రూమర్లే అని కొట్టి పడేస్తున్నారు మరికొొంత మంది ఫ్యాన్స్.