గత కొంతకాలంగా బాక్సాఫీస్ దగ్గర సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయి. ఊపిరి సినిమా తరువాత నాగార్జున నటించిన సినిమాలేవీ ఊపిరి రేంజ్ హిట్ ఇవ్వలేదు. వరుస ఫ్లాపులతో సినిమా సినిమాకు నాగార్జున మార్కెట్ కూడా తగ్గుతోంది. నాగార్జున గత చిత్రం మన్మథుడు2 సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో పాటు నాగార్జున రోల్ గురించి, రకుల్ ప్రీత్ సింగ్ క్యారక్టర్ గురించి విమర్శలు వ్యక్తమయ్యాయి.
వరుస ఫ్లాపులతో సతమవుతున్న నాగార్జున ప్రస్తుతం ఒక కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో నటిస్తున్నారు. మరోవైపు నాగచైతన్యతో పెళ్లి తరువాత వరుస విజయాలు అందుకున్న సమంత కు ఇటీవల నటించిన జాను చిత్రం డిజాస్టర్ కావడంతో అవకాశాలు తగ్గుతున్నాయి. మొదట కొంతమంది దర్శకులు తమ సినిమాల్లో సమంతను తీసుకోవాలని భావించినా జాను ఫ్లాప్ తరువాత ఇతర హీరోయిన్లకు సమంత స్థానంలో అవకాశాలు ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం సమంత ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తాజాగా సమంత ఒక రియాలిటీ షోను హోస్ట్ చేయడానికి కూడా ఓకె చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. సమంత బుల్లితెరపై కాకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రియాలిటీ షోను హోస్ట్ చేస్తుందని తెలుస్తోంది. గతంలో నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలో ఈ షో ఉంటుందని సమాచారం. నాగార్జున కూడా సమంత దారిలో వెబ్ సిరీస్, రియాలిటీ షోలపై ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
అతి త్వరలోనే నాగార్జున వెబ్ సిరీస్, రియాలిటీ షోకు సంబంధించిన వివరాలు అధికారికంగా స్వయంగా నాగార్జునే ప్రకటించనున్నారని సమాచారం. నాగార్జున ఇప్పటివరకు హోస్ట్ చేసిన రియాలిటీ షోలన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. నాగార్జున రియాలిటీ షోలంటే ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తారు. మరి నాగార్జున గురించి వస్తున్న ఈ వార్తల గురించి నాగార్జున స్పష్టత ఇవ్వాల్సి ఉంది.