తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రముఖ తమిళ హీరో నటించిన ఒక హిట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఒక స్టార్ హీరోయిన్, ఆ తరువాత మరొక అగ్ర హీరో నటించిన సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది. అయితే నిజానికి ఆ రెండు సినిమాలు కూడా తమిళ్ రీమేక్స్ అవడంతో ఆ తరువాత డైరెక్ట్ గా తెలుగులో టాప్ హీరో, దర్శకుల కలయికలో వచ్చిన హిట్ సినిమాతో డైరెక్ట్ గా తెలుగుకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో ఇటు టాలీవుడ్ దర్శకలు కూడా ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపించారు.
ఇక అక్కడి నుండి అటు తమిళ్ తో పాటు, ఇటు తెలుగులో కూడా పలువురు అగ్ర హీరోల సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకుని, ఆపై స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది సదరు నటి. అయితే ఆమెకు సినిమా కెరీర్ ఎంతో గొప్పగా ఉన్నప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం కొంత విమర్శలు ఉన్నాయి. ముందుగా అక్కడి తమిళ యువ నటుడితో కొన్నాళ్ళు లవ్ అఫైర్ నడిపిన ఆ హీరోయిన్, ఆ తరువాత అతడి నుండి విడిపోయింది. ఇక అదే సమయంలో అక్కడి మరొక స్టార్ నటుడితో కూడా ఆమె ప్రేమాయణం రహస్యంగా నడిపిందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ హీరో పేరు మాత్రం బయటకు రాలేదు.
ఇక ఆపై నటుడు, నృత్య దర్శకుడైన మరొక వ్యక్తితో కూడా కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపిన ఆ హీరోయిన్, హఠాత్తుగా అతడి భార్య, తన భర్త తో సదరు హీరోయిన్ అక్రమ సమబంధం పెట్టుకుందని కోర్టులో కేసు వేయడంతో వారిద్దరి మధ్య బంధం తెగిపోయింది. అయితే అక్కడి నుండి కొంత ఒంటరిగా గడిపిన సదరు హీరోయిన్, చివరికి ఇటీవల తనతో ఒక మంచి హిట్ మూవీ తీసిన ప్రముఖ దర్శకుడితో బహిరంగంగా ప్రేమాయణం మొదలెట్టింది. నిజానికి వీరిద్దరూ కూడా కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నప్పటికీ, తమ మధ్య ప్రేమ ఉందనే విషయం ఈ ఇద్దరూ కూడా ఇప్పటివరకు బయట పెట్టలేదు. ఈ విధంగా ఏకంగా నలుగురితో అక్రమంగా ప్రేమాయణం నడిపిన ఆ స్టార్ హీరోయిన్ పై ఇప్పటికీ తమిళనాడులోని కొందరు మహిళలు విమర్శలు సందిస్తూనే ఉంటారు. అయితే అది ఆమె వ్యక్తిగత జీవితం అని, ఆమెకు నచ్చినట్లుగా వ్యవహరించే స్వేచ్ఛ ఆమెకు ఉందని పలువురు ఫ్యాన్స్ ఆమెకు ఇప్పటికీ మద్దతు పలుకుతూనే ఉన్నారు...!!