తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుస విజయాలు అందుకుంటున్న హీరోయిన్ సమంత తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉంటుంది.  అక్కినేని నాగ చైతన్యతో వివాహం జరిగిన తర్వాత మూడు నెలల విరామం తీసుకున్న సమంత వరుసగా నటిస్తూ సూపర్ హిట్స్ అందుకుంటుంది.  యూటర్న్, ఓ బేబీ లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా సమంత తన సత్తా చూపించింది.  ఈ మద్య శర్వానంద్ తో కలిసి నటించిన ‘జాను’ బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది.  ఈ మూవీలో సమంత నటనకు మంచి కతాబు ఇచ్చినా.. కమర్షియల్ హిట్ మాత్రం కాలేక పోయింది. ఈ మద్య స్టార్ హీరోయిన్లు హర్రర్ జోనర్ లో ఎక్కువగా నటిస్తున్నారు. 

 

ఆ మద్య ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘రాజు గారిగది2’ లో భయపెట్టే దెయ్యంగా నటించింది సమంత.  ఆ మద్య నయనతార, త్రిష లాంటి అగ్ర హీరోయిన్లు హర్రర్ చిత్రాల్లో నటించి మెప్పించారు.  మయూరి తో నయనతార, మోహినితో త్రిష లు తెలుగు, తమిళ్ లో మంచి విజయాలు అందుకున్నారు.  తాజాగా సమంత వరుస చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ఇప్పటికే విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న ఆమె ఇటీవలే ‘గేమ్ ఓవర్’ ఫేమ్ అశ్విన్ శరవణన్ డైరెక్షన్లో ఒక చిత్రం చేయడానికి ఒప్పుకున్నారు. ఇందులో సమంతతో పాటు ప్రసన్న ప్రధాన పాత్ర పోషించనున్నారు. 

 

ఈ చిత్రం పూర్తిగా హర్రర్ జోనర్ లో తెరకెక్కబోతుంది. అశ్విన్ శరవణన్ గత చిత్రాలు ‘గేమ్ ఓవర్, మాయ’లు కూడా హర్రర్ చిత్రాలే. ఈ రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే సమంత చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి.  ఇప్పటి  వరకు సమంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాల్లో నటించింది.  ఇటీవల రాజుగారి గది2, యూటర్న్ చిత్రాలతో ఆయట్టుకుంది. మరి ఈసారి ఆమె చేయబోతున్న హర్రర్ కథ ఎలా భయపెడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: